నా వ్యాఖ్యలతో మహిళలు బాధపడి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నా : కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించి తాను చేసిన వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా స్పందించారు.

BRS Working President KTR

KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించి తాను చేసిన వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా స్పందించారు. పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యలవల్ల మా మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే, నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. నా అక్కాచెల్లెళ్లను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదని కేటీఆర్ తెలిపారు. దీంతో కేటీఆర్ వ్యాఖ్యలపై చెలరేగిన దుమారం సర్దుమణిగినట్లయింది.

Also Read : KTR Comments : మహిళలపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు.. కాంగ్రెస్ సీరియస్.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపు!

గురువారం పార్టీ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. బస్సుల్లో కుట్లు, అల్లికలు మేం వద్దనట్లేదు. అవసరమైతే బ్రేక్ డ్యాన్స్ లు వేసుకున్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు.. బస్సుల్లో సీట్ల కోసం ప్రయాణికులు తన్నుకుంటున్నారు. ఆర్టీసీ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారని అన్నారు. బస్సుల సంఖ్య పెంచాలని కోరుతున్నామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. బస్సుల్లో అల్లం, వెల్లుల్లి, కుట్లు అల్లికలు చేసుకుంటే తప్పేంమిటి అనే ప్రశ్నకు కేటీఆర్ పైవిధంగా స్పందించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది.

కేటీఆర్ వ్యాఖ్యలపట్ల కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం కేటీఆర్ దిష్టిబొమ్మలను దగ్దం చేయాలని పిలుపునిచ్చింది. తెలంగాణ మహిళలను కించపరుస్తూ బస్‌లలో బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డాన్స్‌లు చేయండి అంటూ కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, శుక్రవారం ఉదయం కేటీఆర్ ట్విటర్ (ఎక్స్) వేదికగా మా మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే, నేను విచారం వ్యక్తం చేస్తున్నాను.. నా అక్కచెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదని వివరణ ఇచ్చారు.

 

ట్రెండింగ్ వార్తలు