Ktr Revanth
KTR Challenges Revanth: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మరో సవాల్ విసిరారు. ట్విట్టర్ వేదికగా రేవంత్ రెడ్డి వేసిన కౌంటర్‌కు ఎన్‌కౌంటర్‌గా ఛాలెంజ్ చేశారు. డ్రగ్స్ టెస్టులు చేయించుకోవడానికి ఎక్కడికి వెళ్లడానికైనా సిద్ధమేనని నువ్వు రెడీయా అని ప్రశ్నించారు. కానీ, ఈ పరీక్షకు రాహుల్ గాంధీ కూడా రెడీగా ఉంటే చెప్పమని తాను ఢిల్లీలోని ఎయిమ్స్ కు వెళ్లి పరీక్ష చేయించుకుంటానని తెలిపారు.
చర్లపల్లి జైలు జీవితం గడిపిన వ్యక్తులు దీనికి రాహుల్ గాంధీని ఒప్పించాలని రేవంత్ రెడ్డికి చురకలంటించారు. టెస్టు రిజల్ట్స్‌లో తనకు క్లీన్ చిట్‌తో వస్తే రేవంత్ రెడ్డి పదవి నుంచి వైదొలుగుతారా అంటూ సవాల్ విసిరారు కేటీఆర్. దాంతో పాటు ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్ టెస్ట్ కు సిద్ధమా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
రెండు రోజుల క్రితం మంత్రి కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి వైట్ ఛాలెంజ్ విసిరిన సంగతి తెలిసిందే. అమర వీరుల స్థూపం దగ్గరకు రావాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మంత్రి కేటీఆర్.. డ్రగ్స్ టెస్ట్‌లకు సిద్ధమని సంచలన ట్వీట్ చేస్తూ రివర్స్ అటాక్ చేశారు.
Read Also: Online Ticket Booking Portal : సినీ పరిశ్రమ పెద్దలతో ఏపీ మంత్రి పేర్ని నాని సమావేశం