Online Ticket Booking Portal : సినీ పరిశ్రమ పెద్దలతో ఏపీ మంత్రి పేర్ని నాని సమావేశం

ఏపీలో సినిమా టికెట్ల విక్రయంపై నెలకొన్న వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయంపై ఇండస్ట్రీ నుంచి వ్యతిరేకత వస్తోంది.

Online Ticket Booking Portal  : సినీ పరిశ్రమ పెద్దలతో ఏపీ మంత్రి పేర్ని నాని సమావేశం

Chiranjeevi Perni Nani

Online Ticket Booking Portal :  ఏపీలో సినిమా టికెట్ల విక్రయంపై నెలకొన్న వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయంపై ఇండస్ట్రీ నుంచి వ్యతిరేకత వస్తోంది. సర్కార్‌ తీరును సినీ పెద్దలు తప్పు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం 11 గంటలకు ఏపీ సచివాలయంలో తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలతో ఏపీ ప్రభుత్వం తరపున మంత్రి పేర్ని నాని సమావేశం అవుతున్నారు. ఈ సమావేశంలో సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్,ఎగ్జిబిటర్స్ ప్రతినిధులు పాల్గోనున్నారు. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశంపై అంతటా ఉత్కంఠ రేపుతోంది. ఏం నిర్ణయం తీసుకుంటారా అన్న ఆసక్తి నెలకొంది. ఆన్‌లైన్ సినిమా టికెట్ అంశంపై ఈ రోజు కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఏపీలో సినిమాల మీద జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. నిజానికి ఇప్పుడు కాదు.. అప్పుడెప్పుడో వకీల్‌సాబ్‌ సినిమా మొదలైనప్పటి నుంచో ఈ హడావుడి జరుగుతోంది. ఐతే ఆ తర్వాత టికెట్‌ రేట్లను నిర్ణయిస్తూ ఏపీ ప్రభుత్వం జీవోను సవరించడం.. తమ అనుమతి లేకుండా టిక్కెట్ల ధరలు పెంచటానికి వీళ్లేదంటూ ఆదేశాలు జారీ చేయడం చకచకా జరిగిపోయాయి. దీంతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా కుదుపు మొదలైంది. నిజానికి థియేటర్లు ఓపెన్ అయినా.. పెద్ద సినిమాలు తెరమీదకు రాకపోవడానికి ఇది కూడా ఒక కారణమే.

ఇలాంటి పరిస్థితుల్లో ఇండస్ట్రీ నుంచి తాము ఏం కోరుకుంటున్నామో చెప్పడానికి చిరు నాయకత్వంలో టాలీవుడ్‌ ప్రముఖులు సిద్ధమైనట్లు. త్వరలోనే సీఎంను కలిసేందుకు రెడీ అయినట్లు ఫిలింనగర్ నుండి తాడేపల్లి వరకు చర్చ జరిగింది. కానీ ఇంతవరకూ ప్రభుత్వం నుంచి అధికారికంగా ఆహ్వానం మాత్రం రాలేదు. పెద్ద పెద్ద సినిమాలన్నీ విడుదలపై ఇంకా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాయి.

ఈ నేపథ్యంలో ఇవాళ ఏపీ ప్రభుత్వంతో సినిమా థియేటర్స్ ఓనర్స్, ఎగ్జిబిటర్స్ సమావేశం కానున్నారు. సినిమా టికెట్ల ధరలపై చర్చించనున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి సంచలన కామెంట్స్ మరోసారి సినిమా ఇండస్ట్రీ సమస్యలు తెరపైకి వచ్చాయి. ఇండస్ట్రీ ఇబ్బందుల్లో ఉందని చిరంజీవే స్వయంగా తెలిపారు.
Also Read : Car Fire Accident : డాక్టర్ ప్రాణం తీసిన ఎలుకలు ….

సినిమా టికెట్ల విక్రయానికి సంబంధించి జగన్‌ సర్కార్‌ తీసుకున్న సంచలన నిర్ణయం కూడా ఇండస్ట్రీని షేక్ చేసింది. టికెట్ల బుకింగ్‌ కోసం రైల్వే ఆన్‌లైన్ టికెటింగ్ సిస్టమ్‌ మాదిరిగానే ప్రత్యేక పోర్టల్ ను.. రూపొందిస్తున్నట్లు ప్రకటించడంపై ఎగ్జిబిటర్స్, నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. ఏపీలో మెజారిటీ సింగిల్ స్క్రీన్‌ సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్‌లు కొంతమంది పెద్ద నిర్మాతల కంట్రోల్‌లో నడుస్తున్నాయి. సినిమా రిలీజ్‌ డేట్లు, స్క్రీనింగ్‌లపై పూర్తి నియంత్రణ వీరిదే ఉంటుంది. ఇలాంటి వారికి, వారి ఆధ్వర్యంలోని నియంత్రిత వ్యవస్థకు చెక్ పెట్టేందుకే కొత్త పోర్టల్‌ను సిద్ధం చేయాలని ప్రభుత్వం భావిస్తుందని పొలిటికల్ కమ్ సినీ ఇండస్ట్రీ టాక్.

ఐతే సినిమా టికెట్ల విషయంలో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకే కొత్త పోర్టల్ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. నిజానికి ఈ ఏడాది ఏప్రిల్‌లోనే సినిమా టికెట్ ధరలను నిర్ణయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రామాల్లో ఉండే నాన్‌ ఏపీ థియేటర్‌లో ఎంత ఉండాలన్న దాని నుంచి.. మున్సిపల్ కార్పొరేషన్‌లో మల్టీప్లెక్స్ వరకు సీలింగ్ రేట్లను నిర్ణయించింది.

నిజానికి ప్రభుత్వ నిర్ణయంతో సగటు సినిమా ప్రేక్షకుడికి చాలా ఉపయోగపడే అంశమే. రిలీజ్‌ అయిన మొదటి మూడు రోజుల్లో సినిమా చూడాలంటే.. జేబుకు చిల్లు పడుతుంటుంది. ఐతే ప్రభుత్వమే విక్రయిస్తే.. బ్లాక్‌ మార్కెట్‌ దందాకు చెక్‌ పడే అవకాశం ఉంటుంది. టాప్‌ హీరోలు, డైరెక్టర్లు రెమ్యునరేషన్లు తగ్గించుకుంటే సినిమా బడ్జెట్ తగ్గి నిర్మాతలపై భారం తగ్గుతుందని ఏపీ ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.
Also Read : Drugs Seized : అఫ్ఘానిస్తాన్-టూ-విజయవాడ …రూ. 9 వేల కోట్ల డ్రగ్స్ రాకెట్

మాములుగా వంద కోట్ల సినిమాను తీసుకుంటే రెమ్యునరేషన్ బడ్జెటే 70 కోట్ల దాకా ఉంటుంది. ఇందులో సగానికి పైగా హీరో, డైరెక్టర్‌కే వెళ్లిపోతోంది. ఈ బడ్జెట్‌కు తగ్గ వసూళ్ల కోసం నిర్మాతలు, ఎగ్జిబిటర్లు టికెట్ ధరలు పెంచాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ విధానంపైనే ఏపీ ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. హీరో, డైరెక్టర్ రెమ్యూనరేషన్‌ తగ్గించుకుంటే సినిమా బడ్జెట్‌ కూడా తగ్గిపోతోంది. అప్పుడు టికెట్ ధరలు పెంచాల్సిన అవసరం లేదనేది ఏపీ సర్కార్ వాదన. ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి రెమ్యునరేషన్‌పై చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందనేది ఆసక్తి నెలకొంది.