ఇటీవల ప్రవేశ బడ్జెట్‌పై అసెంబ్లీలో చర్చ మొదలైంది. చర్చలో భాగంగా మొదటిరోజైన శనివారం పలు ప్రశ్నలపై మంత్రి కేటీఆర్ సమాధానాలిచ్చారు. ఈ మేరకు ఐటీఐఆర్( ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్)పై కేదరి కిశోర్, వివేకానంద్, శ్రీధర బాబు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు.
ఐటీఐఆర్ గురించి పదవీ కాలం పూర్తయిపోతున్న సమయంలో యూపీఏ ప్రభుత్వం 2013లో కొత్త కార్యక్రమం తీసుకొచ్చిందని గుర్తు చేశారు. కానీ, దానికి ఒక్క పైసా కూడా నిధులు కేంద్రం నుంచి రాలేదని తెలిపారు. దీనిపై ఎన్డీఏ ప్రభుత్వాన్ని అడిగినా ప్రయోజనం లేకుండా పోయిందని వివరించారు. కేంద్ర మంత్రిగా రవి శంకర్, ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ ఉన్నప్పుడు ఇదే అంశాన్ని లేఖల ద్వారా, నేరుగా ప్రస్తావించామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
యూపీఏ గానీ, ఎన్డీఏ గానీ కాంగ్రెస్, బీజేపీలు ఒక్క రూపాయి కూడా దీని గురించి నిధులు ఇవ్వలేదని ఆయన వివరించారు. వారు ఇవ్వలేదని ఐటీ ఆగిపోయిందేమీ లేదని దేశవ్యాప్తంగా ఐటీ 8నుంచి 9శాతం వృద్ధి చెందితే తెలంగాణలో 17శాతానికి పెరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు.