తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఈ నెల 9న ఏసీబీ విచారణకు హాజరుకావాల్సి ఉన్న నేపథ్యంలో హైకోర్టులో ఆయన లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ విచారణకు తన న్యాయవాదిని అనుమతించాలని పిటిషన్‌లో కేటీఆర్ కోరారు. ఈ పిటిషన్‌పై విచారణకు హైకోర్టు అనుమతించింది.
కాగా, ఏసీబీ విచారణకు హాజరుకావడానికి ఈనెల 6న ఆ కార్యాలయానికి కేటీఆర్ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, తన న్యాయవాదిని లోపలికి అనుమతించకపోవడంతో విచారణకు హాజరుకాలేనంటూ ఏసీబీ కార్యాలయం నుంచి ఆయన తిరిగి వెళ్లిపోయారు.
ఏసీబీ అధికారులు కేటీఆర్‌కు మరోసారి నోటీసులు జారీ చేసి, గురువారం విచారణకు హాజరు కావాలని చెప్పారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో ఆయన లంచ్‌మోషన్ పిటిషన్ వేశారు.
ఇటీవలే ఫార్ములా ఈ-కారు రేసు కేసులో కేటీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఆయన ఇప్పటికే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. తన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో ఈ తీర్పును సవాల్ చేస్తూ కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
HMPV virus cases: హెచ్‌ఎంపీవీ కేసులపట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం