Ktr Fires On Oppositions About Criticizing Kcr
KTR: రైతు వేదిక ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్.. కొదురుపాకలో ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు. దమ్ముంటే కాంగ్రెస్-బీజేపీ నాయకులు సమాధానం చెప్పండి. మీ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో రైతులకు 24 గంటల పాటు ఉచితంగా కరెంటు ఇవ్వగలుగుతున్నారా.. బీజేపీ-కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాల్లో రైతుబంధు ఇచ్చే సంస్కారం ఎక్కడైనా ఉందా.
అంతేకాదు.. రైతు చనిపోతే ఐదు లక్షలు బీమా, ఆడబిడ్డ పెళ్ళికి కల్యాణ లక్ష్మి కింద రూ.లక్ష 116 ఇచ్చే సంస్కారం మీకుందా, దమ్ముంటే చూపించండి. భారతదేశం మొత్తంలో ఎక్కడైనా రైతు వేదికలు ఏర్పాటు చేయాలని ఆలోచించారా.. రైతును రాజు చేయాలనే ప్రయత్నం ఎక్కడైనా జరుగుతుందా.
కేసీఆర్‌ను ఎంత తిడితే అంత గొప్ప అనుకునే పిచ్చి నాయకులను అడుగుతున్నా. ఆయణ్ను ఎంత తిట్టినా ఎంత దూషించిన ఒరిగేదేమీ లేదు. తిడితే పెద్ద లీడర్లు అయిపోలేరు. తెలంగాణను కేసీఆర్ ప్రేమించినంతగా ప్రపంచంలో ఎవ్వరూ ప్రేమించలేరు.
అందుకే కేసీఆర్‌కు ప్రజల మద్దతు ఉంది. ఆయన గెలవాలంటే ఆయన కంటే ఎక్కువ ప్రేమించగలగాలి. ఆయన వయస్సు మరిచిపోయి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఆయన నాయకత్వంలోనే తెలంగాణ వచ్చిందనే విషయాన్ని మరిచి పిచ్చి ప్రేలాపనలు చేసే పిచ్చి నాయకులకు ప్రజలే సమాధానం చెప్పాలని అన్నారు.