Telangana Bhavan : ప్రతిపక్షం బలపడుతుంది.. తెలంగాణ భవన్‌లో పంచాంగ శ్రవణంలో వెల్లడి..
Telangana Bhavan : తెలంగాణ భవన్ లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఉగాది వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- Harishth Thanniru
- Published On : March 19, 2026 / 12:48 PM IST
Ugadi Celebrations At Telangana Bhavan
- తెలంగాణ భవన్ లో ఉగాది వేడుకలు
- పాల్గొన్న కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు
- పంచాంగ శ్రవణం వినిపించిన పండితులు
Telangana Bhavan : తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు ఉగాది వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఉదయాన్నే ఆలయాల వద్దకు వెళ్లి పూజలు నిర్వహించి.. ఆలయాల్లో పండితులు చెప్పిన పంచాంగ శ్రవణాలను శ్రద్దగా విన్నారు. అంతేకాక.. పార్టీ కార్యాలయాల్లోనూ ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. పండితులు పంచాంగ శ్రవణాలను వినిపించారు.
తెలంగాణ భవన్ లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఉగాది వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మృత్యుంజయ శర్మ, ఫణిందర్ శర్మలు తెలంగాణ భవన్ లో ప్రత్యేక పూజలు నిర్వహించి.. ఆ తరువాత పంచాంగ శ్రవణం వినిపించారు.
ఎన్ని ఆటుపోట్లు వచ్చిన మన ప్రధాని శాంతిని నెలకొల్పోతారని చెప్పారు. అదే సమయంలో ప్రభుత్వం చేసే లోటుపాట్ల వలన ప్రతిపక్షం బలపడుతుందని అన్నారు. సరైన సమయంలో వర్షాలు కురుస్తాయి, పంటలు పండుతాయి. రైతుల ఆత్మహత్యలు తగ్గుతాయి. అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని తెలిపారు. సినీ, రాజకీయ ప్రముఖులు కొందరు కనుమరుగు అయ్యే అవకాశం ఉందని అన్నారు. జలాశయాలు సమృద్ధిగా నిండుతాయి. రైతుల సమస్యల పై ప్రతిపక్షాల కృషి పలిస్తుంది. దీని ద్వారా పంటలు బాగా పండుతాయి. ఈశ్వరుడు పైఉన్న ఆ చంద్రుడు క్రాంతిని ప్రసరిస్తాడు. మన అందరికీ ఉన్న చంద్ర శేఖరుడు లోకానికి ప్రసరిస్తాడని చెప్పారు.
