KTR: కీలక పరిణామం.. హరీశ్ రావుతో కేటీఆర్ భేటీ

కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని అన్నారు.

తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావుతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. హరీశ్ రావు తండ్రి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల హరీశ్ రావు తండ్రి అనారోగ్యాన్ని గురయ్యారు.

కోకాపేటలోని హరీశ్ రావు నివాసంలో దాదాపు రెండు గంటల పాటు కేటీఆర్ ఉన్నారు. తాజా రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించారు. హరీష్ రావు పార్టీ మారతారన్న ప్రచారంపై సైబర్ సెల్ కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే, తాను పార్టీ లైను దాటనని ఇటీవల హరీశ్ రావు స్పష్టం చేశారు.

Also Read: ఫ్యూచర్ సీటీలో పూర్తిస్థాయిలో భూగర్భ విద్యుత్ లైన్లు.. విద్యుత్ టవర్లు, పోల్స్ బయటికి కనపడొద్దు.. ఇలా చేయండి: రేవంత్‌ ఆదేశం

కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని అన్నారు. కేటీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పగించినప్పటికీ పని చేస్తానని అన్నారు. వరంగల్ సభ తర్వాత పార్టీలో హరీశ్ రావు ప్రాముఖ్యత తగ్గిందని జరుగుతున్న తప్పుడు ప్రచారంపై బీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానం మండిపడుతోంది. దీంతో నేరుగా హరీశ్ రావుతో మాట్లాడి సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టాలని కేటీఆర్ భావించినట్లు తెలుస్తోంది.