KTR: ఇలా చేసుకుంటూ పోతే ఊరుకునేది లేదు: మాజీ మంత్రి కేటీఆర్

రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ఉండి హుందాగా మాట్లాడడం లేదని కేటీఆర్ చెప్పారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత..

BRS working president KTR

KTR: బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా అచ్చంపేటలో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని కాంగ్రెస్ పార్టీ ముందే ప్రకటిస్తే ఆ పార్టీకి 30 సీట్లు కూడా రాకపోయేవని అన్నారు.

రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ఉండి హుందాగా మాట్లాడడం లేదని కేటీఆర్ చెప్పారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధు కోసం రైతులు ముఖాలు చూసుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు. కరెంటు కోతలు, తాగునీటి బాధలు షురూ అయ్యాయని విమర్శించారు.

కాంగ్రెస్ తీసుకొస్తానన్న మార్పు ఇదేనా? అని కేటీఆర్ ప్రశ్నించారు. మిషన్ భగీరథను నిర్వహించే తెలివి కూడా కాంగ్రెస్ సర్కారుకు లేదని అన్నారు. అధికారంలోకి వస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులే అనుకోలేదని చెప్పారు. అందుకే వారు ఇష్టం వచ్చినట్లు హామీలు ఇచ్చారని తెలిపారు.

ఇప్పుడు కొందరికి మాత్రమే పథకాలు ఇస్తామంటున్నారని కేటీఆర్ విమర్శించారు. రూ.500కే సిలిండర్ ఇస్తామన్నారని చెప్పారు. కోటి 24 లక్షల గ్యాస్ సిలిండర్ కనెక్షన్లు ఉన్నాయని, వాళ్లందరూ ఎదురుచూస్తున్నారని అన్నారు. 200 యూనిట్లు ఫ్రీ విద్యుత్ అని చెప్పి, కొందరికే ఇస్తామంటున్నారని తెలిపారు.

వచ్చిపోయే ముఖ్యమంత్రులు ఎంతమంది ఉన్నా తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ ఒక్కరేనని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఇక పాలమూరు రంగారెడ్డికి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వని ప్రధాని మోదీ గురించి మనం ఎందుకు అలోచించాలని నిలదీశారు.

Read Also: తెలంగాణలో కాంగ్రెస్ టార్గెట్ ఇదే..: జగ్గారెడ్డి

ట్రెండింగ్ వార్తలు