KTR
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు మాత్రమే వినిపిస్తాయా అంటూ తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఎన్నో మాట్లాడారని అన్నారు. వారి గురించి గవర్నర్ ఏమీ మాట్లాడడం లేదని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ అనేందుకు ఇది ఉదాహరణ కదా? అని అన్నారు. ఇవాళ కేటీఆర్ మీడియాతో చిట్ చాట్‌లో పాల్గొన్నారు.
తాము ఈ నెల 27 నుంచి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమీక్షలు నిర్వహిస్తామని కేటీఆర్ చెప్పారు. ఫిబ్రవరి 10 లోపు అన్ని సమావేశాలు పూర్తి చేస్తామన్నారు. తమ సోషల్ మీడియా ఖాతాలను యాక్టీవ్ చేస్తామని తెలిపారు.
కొత్త ప్రభుత్వంపై వ్యతిరేకత
కొత్త ప్రభుత్వంపై వేగంగా వ్యతిరేకత వస్తోందని కేటీఆర్ అన్నారు. కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్లకు సహనం కూడా ఉండాలని, రైతు భరోసా అడిగితే చెప్పుతో కొడతామనడం సమంజసమా? అని కేటీఆర్ అడిగారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తాము గుర్తు చేస్తున్నామని చెప్పారు. కేఆర్ఎంబీ పై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం దగ్గర తాకట్టు పెడుతుందని అన్నారు.
ఇంకా ఏమన్నారు?
పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్.. తొలిసారి పెద్దఎత్తున బూత్ స్థాయి కన్వీనర్ల సమావేశం