KTR On Allu Arjun Arrest: ఇదే లాజిక్ రేవంత్ రెడ్డికి వర్తించదా..? అల్లు అర్జున్ అరెస్టుపై కేటీఆర్ ట్వీట్

సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్ వేదికగా స్పందించారు.

KTR

Actor Allu Arjun Arrested: పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలో అల్లు అర్జున్ హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ కు వెళ్లారు. ఆ సమయంలో తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మరణించగా.. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు. కాగా.. శుక్రవారం  అల్లు అర్జున్ ను చిక్కడిపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  అల్లు అర్జున్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్ వేదికగా స్పందించారు. జాతీయ అవార్డు పొందిన అల్లు అర్జున్ అరెస్టు సరైంది కాదని అన్నారు. తొక్కిసలాటకు అల్లు అర్జున్ ప్రత్యక్షంగా కారణం కాదు. ఆయన పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు బాగోలేదని కేటీఆర్ పేర్కొన్నారు. అల్లు అర్జున్ సాధారణ నేరస్థుడిలా చూడడం సరికాదు. పాలకుల అభద్రతా భావానికి అల్లు అర్జున్ అరెస్టు తీరు నిదర్శనమని కేటీఆర్ విమర్శించారు.

Also Read: Allu Arjun arreste: అల్లు అర్జున్ అరెస్టు వెనక చంద్రబాబు హస్తం.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ నేరుగా బాధ్యుడు కాదు.. అల్లు అరెస్టున్ అరెస్టు తీరును ఖండిస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ బాధ్యుడని అరెస్టు చేశారు.. ఇదే లాజిక్ తో రేవంత్ రెడ్డిని కూడా అరెస్టు చేయాలి కదా.. హైడ్రా వల్ల ఇద్దరి మరణానికి రేవంత్ కారణమయ్యారు అంటూ కేటీఆర్ ట్విటర్ లో పేర్కొన్నారు.