Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్టు వెనక చంద్రబాబు హస్తం.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

అల్లు అర్జున్ అరెస్టు పై వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి స్పందించారు. ఈ క్రమంలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ అరెస్టు బాధాకరమని..

Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్టు వెనక చంద్రబాబు హస్తం.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

Lakshmi Parvati

Updated On : December 13, 2024 / 3:17 PM IST

Lakshmi Parvathi On Allu Arjun Arrest : ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ‘పుష్ప2’ రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతిచెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ పై బీఎన్ఎస్ 105, 118 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు. తాజాగా అల్లు అర్జున్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read: Mohan Babu : మోహ‌న్ బాబు ఇంటికి వెళ్లిన పోలీసులు.. నివాసంలో లేని డైలాగ్ కింగ్‌..!

అల్లు అర్జున్ అరెస్టు పై వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి స్పందించారు. ఈ క్రమంలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ అరెస్టు బాధాకరమని, ప్రతిదానిలో చంద్రబాబు నాయుడు హస్తం ఉంటుందని పేర్కొన్నారు. సినిమా ఎలా ఉంది చూడటానికి అల్లు అర్జున్ వెళ్లాడు.. అయితే, అల్లు అర్జున్ వెళ్లినప్పుడు అక్కడ ఏర్పాట్లు చేయని ప్రభుత్వానికి తప్పు. ఏ తప్పు చేయని అల్లు అర్జున్ ను అరెస్టు చేశారని లక్ష్మీపార్వతి అన్నారు. రాజమండ్రి పుష్కరాల్లో, కందుకూరులో ఘటనల సమయంలో మచి చంద్రబాబును ఎన్నిసార్లు అరెస్టు చేయాలని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. ఏపీలో చంద్రబాబు.. అక్కడ ఆయన శిష్యుడు ఉన్నారు. రెండు రాష్ట్రాల్లో రాక్షస పాలన సాగుతోందని లక్ష్మీపార్వతి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.