KTR: ఎల్బీనగర్‌ నుంచి పెద్ద అంబర్‌పేట వరకు మెట్రో.. జేబీఎస్ నుంచి తూంకుంటకు కూడా.. అంతేకాదు..: కేటీఆర్

ఉప్పల్‌ నుంచి బీబీనగర్‌ వరకు మెట్రో విస్తరణ ఉంటుందని తెలిపారు. ప్యాట్నీ నుంచి కండ్లకోయ వరకు డబుల్‌ డెక్కర్‌ మెట్రో వేస్తామని చెప్పారు.

KTR

KTR – Metro line: హైదరాబాద్‌లో మెట్రో రైలును మరింత విస్తరిస్తామని తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ మంత్రివర్గ సమావేశం ముగిసింది. దాదాపు 5 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలపై కేటీఆర్ వివరాలు తెలిపారు.

హైదరాబాద్‌లో 60 వేల కోట్ల రూపాయలతో మెట్రోను మరింత విస్తరిస్తామని కేటీఆర్ ప్రకటించారు. జేబీఎస్ నుంచి తూంకుంట వరకు మెట్రోను విస్తరిస్తామన్నారు. అలాగే, మియాపూర్‌ నుంచి లక్డీకపూల్‌ వరకు మెట్రో విస్తరణ ఉంటుందని చెప్పారు.

ఎల్బీనగర్‌ నుంచి పెద్ద అంబర్‌పేట వరకు మెట్రో విస్తరిస్తామని చెప్పారు. అంతేగాక, ఉప్పల్‌ నుంచి బీబీనగర్‌ వరకు మెట్రో విస్తరణ ఉంటుందని తెలిపారు. ప్యాట్నీ నుంచి కండ్లకోయ వరకు డబుల్‌ డెక్కర్‌ మెట్రో వేస్తామని చెప్పారు. భవిష్యత్ లో షాద్ నగర్ వరకు.. మెట్రో విస్తరణకు నిర్ణయం తీసుకున్నామన్నారు.

కేంద్రం సహకరిస్తుందని ఆశిస్తున్నామని, లేకపోతే వచ్చే ప్రభుత్వంలో బీఆర్ఎస్ సాధించుకుంటుందని అన్నారు. మూడు నాలుగేళ్లలో మెట్రోను బాగా వాస్తరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

KTR: ప్రభుత్వంలో టీఎస్‌ఆర్టీసీ విలీనం… తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం