BRS Working President KTR
బీజేపీ, కాంగ్రెస్ నేతలపై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ట్వీట్ చేశారు. ఢిల్లీలో తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమైన వార్తను పోస్ట్ చేస్తూ కేటీఆర్ పలు వ్యాఖ్యలు చేశారు.
“మోదీ గారూ.. కలిసికట్టుగానే పని చేస్తున్నారు మీ కమలం నేతలు.. కాంగ్రెస్ నేతలతో కలిసిపోయి మరీ పని చేస్తున్నారు! చోటేభాయ్ కు వ్యూహకర్తగా.. కాంగ్రెస్ కట్టర్ కార్యకర్తలుగా.. విశ్రమించకుండా పని చేస్తున్నారు!” అని కేటీఆర్ అన్నారు.
“చీకటి రాజకీయ ప్రయోజనాల కోసం ‘చేతి’ కలుపుతూ చోటే భాయ్ కోసం కలిసి పని చేస్తున్నారు! ఎన్ని అరాచకాలు జరిగినా ఒక్కరూ నోరుమెదపరు! రేవంత్ మీద ఈగ వాలకుండా కాపాడుకుంటారు! హైడ్రా మంచిదంటారు, మూసి కావాలంటారు, ఏమన్నా అంటే నిద్ర నటిస్తారు!” అని కేటీఆర్ చెప్పారు.
“పిల్లలు చనిపోయినా, రైతు గుండె పగిలినా, గిరిజనులను చెరపట్టినా, చప్పట్లు కొడతారు! తెలంగాణలో వారి చేతిలోనే కమలం ఉంది!జాగ్రత్తగా! భద్రంగా!” అని కేటీఆర్ విమర్శించారు.
Modi గారూ..
కలిసికట్టుగానే పని చేస్తున్నారు మీ కమలంనేతలు
కాంగ్రెస్ నేతలతో కలిసిపోయి మరీ పని చేస్తున్నారు!చోటేభాయ్ కు వ్యూహకర్తగా…
కాంగ్రెస్ కట్టర్ కార్యకర్తలుగా..
విశ్రమించకుండా పని చేస్తున్నారు!చీకటి రాజకీయ ప్రయోజనాల కోసం
‘చేతి’ కలుపుతూ చోటే భాయ్ కోసం కలిసి పని… pic.twitter.com/UQTLiUw9qP— KTR (@KTRBRS) November 28, 2024
Viral Video: జైలు నుంచి విడుదలై.. అదిరిపోయే డ్యాన్స్ చేసిన యువకుడు