KTR: ఆటోలో ప్రయాణించిన కేటీఆర్.. వీడియో వైరల్

మాజీ మంత్రి అయుండి ఇంత సింపుల్‌గా ఉండడం కేటీఆర్‌కే సాధ్యమవుతుందంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రశంసలతో..

లోక్‌సభ ఎన్నికలు కొన్ని నెలల్లో జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది. దీంతో హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తెలంగాణ భవన్ వద్దకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ప్రతి రోజు పెద్ద ఎత్తున వస్తున్నారు.

ఇవాళ బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమీక్షా సమావేశం ముగిసిన అనంతరం యూసఫ్‌గూడ నుంచి తెలంగాణ భవన్ వరకు ఆటోలో వెళ్లారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా తీసిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

మాజీ మంత్రి అయుండి ఇంత సింపుల్‌గా ఉండడం కేటీఆర్‌కే సాధ్యమవుతుందంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కాగా, సికింద్రాబాద్ లోక్‌సభ నియోజక వర్గ పరిధిలో జూబ్లిహిల్స్ ఉంటుంది. సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2019లో బీఆర్ఎస్ అభ్యర్థిగా తలసాని సాయికిరణ్‌ పోటీ చేసి ఓడిపోయారు.

ఈ సారి సాయికిరణ్‌ను లేదా బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత రావుల శ్రీధర్‌రెడ్డిను పోటీలోకి దింపే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణలోని పలు నియోజక వర్గాలపై బీఆర్ఎస్ సమీక్షా సమావేశాలు నిర్వహించింది.

Also Read: తెలంగాణలో అమిత్ షా పర్యటన రద్దు..