Amit Shah: తెలంగాణలో అమిత్ షా పర్యటన రద్దు.. ఎందుకంటే?

బిహార్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన తెలంగాణ పర్యటన రద్దయింది.

Amit Shah: తెలంగాణలో అమిత్ షా పర్యటన రద్దు.. ఎందుకంటే?

Amit Shah

Updated On : January 27, 2024 / 3:45 PM IST

కేంద్ర మంత్రి అమిత్ షా శనివారం తెలంగాణలో పర్యటించాలనుకున్నారు. అయితే, బిహార్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన తెలంగాణ పర్యటన రద్దయింది. బిహార్‌లో ఆర్జేడీతో తెగదెంపులు చేసుకునే యత్నంలో సీఎం నితీశ్ కుమార్ ఉన్నారు. దీంతో బీజేపీ చేపట్టాల్సిన చర్యలు, మంత్రివర్గ కూర్పుపై బీజేపీ కార్యాలయంలో చర్చ జరుగుతోంది. దీనిపైనే ప్రస్తుతం షా దృష్టిపెట్టారు.

ముందుగా నిర్ణయించిన షెడ్యేల్ ప్రకారం అమిత్ పర్యటన జరిగితే.. శనివారం మధ్యాహ్నం 1.05 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకునేవారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో మహబూబ్ నగర్‌కు 1.35 గంటలకు వెళ్లేవారు.

ఆ తర్వాత సుదర్శన్ ఫంక్షన్ హాల్‌లో ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీలతో సమావేశం కావాలనుకున్నారు. 2.55 గంటలకు మహబూబ్ నగర్ నుంచి కరీంనగర్ బయలుదేరి. సాయంత్రం 4 గంటలకు కరీంనగర్ చేరుకుని, కరీంనగర్ లోక్‌సభతో పాటు, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ కార్యకర్తలకు నేతలకు దిశానిర్దేశం చేయాలని భావించారు. సాయంత్రం 5 గంటలకు కరీంనగర్ నుంచి బయలుదేరి 6 గంటలకు తిరిగి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని హైదరాబాద్ లో మహిళా సమ్మేళనంలో పాల్గొనాలనుకున్నారు. అమిత్ షా పర్యటన రద్దుతో ఈ కార్యక్రమాలన్నీ మరోరోజుకి వాయిదా పడ్డాయి.

Also Read : పవన్.. జనసైనికులు సంతృప్తిగా లేరు.. టీడీపీ, జనసేన పొత్తుపై హరిరామ జోగయ్య కీలక వ్యాఖ్యలు