ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వివాదం.. కవిత ఇంటి వద్ద ఏం జరుగుతోందో తెలుసా?

కాగా, తెలంగాణ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి కవిత అరెస్టుపై ఈడీ అధికారులు సమాచారం అందించారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆమె ఇంటి వద్దకు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు చేరుకున్నారు. కవితను ఈడీ అధికారులు ఢిల్లీకి తరలించనున్న నేపథ్యంలో వారితో కేటీఆర్ వాగ్వివాదానికి దిగారు. అధికారులు నిబంధనలను అతిక్రమిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.

కవిత నివాసానికి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పార్లమెంటరీ పార్టీనేత కేకే సహా పలువురు నేతలు వచ్చారు. కాగా, తెలంగాణ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి కవిత అరెస్టుపై ఈడీ అధికారులు సమాచారం అందించారు. కవిత ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

కాగా, ఈడీ మహిళా అధికారి భాను ప్రియా మీనా నేత్రత్వంలో కవిత అరెస్ట్ అయ్యారు. ఈడీ అధికారులకు సంపూర్ణంగా సహకరిస్తామని కవిత చెప్పారు. ఈడీ అక్రమ అరెస్టును న్యాయపరంగా, శాంతియుతంగా ఎదుర్కొంటామని తెలిపిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు.

అరెస్టుని అడ్డుకోవద్దని.. పార్టీ కార్యకర్తలు శాంతియుతంగా వ్యవహరించాలని కోరారు కేటీఆర్, హరీశ్ రావు  కోరారు. కవిత నివాసానికి మాజీ మంత్రులు తలసాని, సబిత కూడా చేరుకున్నారు.

కవితను అదుపులోకి తీసుకున్న ఈడీ.. లిక్కర్ కేసులో ఏ రోజు ఏం జరిగిందో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు