Leopard
Leopard : తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లోని నిర్మల్ జిల్లాలో చిరుతపులి సంచారం ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. జిల్లాలోని కుబీర్ మండలం మర్లగొండ గ్రామ శివారులో చిరుత పులి సంచరిస్తోంది.
రాత్రి పూట అటువైపు వెళ్లిన గ్రామస్తులకు చిరుత కనపడింది. వారు దాన్ని తమ సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. ఇదే చిరుతపులి రెండురోజుల క్రితం మహారాష్ట్ర లోని ఆంథ్‌బొరి గ్రామంలో ఒక మేకపిల్ల, ఒక కుక్కపిల్లను చంపితిన్నట్లు సమాచారం.
Also Read : Pinnelli Ramakrishna Reddy : కెనాల్‌లోకి దూసుకెళ్లిన ఎమ్మెల్యే సోదరుడి కారు..
దీంతో సరిహద్దుల్లో ఉన్న గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. చిరుతపులినుండి తమను రక్షించాలని ప్రజలు అటవీ అధికారులను కోరుతున్నారు.