Leopard : చిరుతపులి సంచారం-భయంతో వణుకుతున్న ప్రజలు

కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని బూజునూరు గ్రామ పెద్ద చెరువు సమీపంలో నిన్న సాయంత్రం చిరుతపులి సంచరించింది.

Leopard Karimnagar

Leopard :  కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని బూజునూరు గ్రామ పెద్ద చెరువు సమీపంలో నిన్న సాయంత్రం చిరుతపులి సంచరించింది. దీంతో సమీప గ్రామ ప్రజలు భయాందోళనలో ఉన్నారు.  దీంతో గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు  సూచించారు. రెండు రోజుల క్రితం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల పరిసరాలలో చిరుత సంచరించింది. అదే చిరుత ప్రస్తుతం బూజునూరు గ్రామానికి వచ్చిందంటూ ఈ ప్రాంతంలో వదంతులు వ్యాపించాయి.

Also Read :Nandyal: అతిసారతో ఒకరి మృతి.. మ‌రో అరుగురికి ఆసుపత్రిలో చికిత్స‌