Minister talasani: ఒకేసారి ఎన్నికలకు వెళ్దాం.. ఎవరు గెలుస్తారో తేల్చుకుందాం

కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తే వెంటనే దేశవ్యాప్త ఎన్నికలకు తెరాస సిద్ధమని, ఒకేసారి ఎన్నికలకు వెళ్దామని అప్పుడు ఎవరు గెలుస్తారో ప్రజలు నిర్ణయిస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అధికారంలో ఉన్నారని ఇష్టారీతిలో వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ...

Minister talasani: కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తే వెంటనే దేశవ్యాప్త ఎన్నికలకు తెరాస సిద్ధమని, ఒకేసారి ఎన్నికలకు వెళ్దామని అప్పుడు ఎవరు గెలుస్తారో ప్రజలు నిర్ణయిస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అధికారంలో ఉన్నారని ఇష్టారీతిలో వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ అమిత్ షాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన హూందాను మరిచి సీఎం కేసీఆర్ పై వ్యాఖ్యలు చేశారంటూ తలసాని మండిపడ్డారు.

Minister Talasani : గవర్నర్ వ్యవస్థ అవసరమే లేదు : మంత్రి తలసాని

ఆదివారం హైదరాబాద్ సనత్ నగర్ లోని బండమైసమ్మలో రూ. 27.50 కోట్లతో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రోరంభోత్సవంలో మంత్రి ప్రశాంత్ రెడ్డితో కలిసి తలసాని హాజరయ్యారు. గుజరాత్ లో డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎందుకు నిర్మించలేదో అమిత్ షా చెప్పాలని తలసాని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించలేదనే వారు తమ వెంట వస్తే భవనాలు చూపెడతామని తలసాని అన్నారు. మంత్రి పదవులన్నీ కేసీఆర్ కుటుంబానికే అని అమిత్ షా అన్నారని, మిగతా మంత్రులకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. దేశ సంపదను ప్రధాని మోదీ ఆదాని, అంబానీలకు దోచిపెడుతున్నారని విమర్శించారు. కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు బండి సంజయ్‌ చాలన్న అమిత్‌ షా.. తెలంగాణకు ఎందుకొచ్చారని ప్రశ్నించారు.

ట్రెండింగ్ వార్తలు