little girl says KCR PM,harish rao CM
Telangana : కేసీఆర్ పీఎం, హరీశ్ రావు సీఎం అంటూ చిన్నారి చెప్పిన మాటలకు వేదికమీదున్నవారితో పాటు తెలంగాణ మంత్రి హరీశ్ రావు నవ్వుకున్నారు. సిద్దిపేట జిల్లా మిట్టపల్లి గ్రామంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన ఈ కార్యక్రమంలో కాసేపు అందరిని తన ముద్దు ముద్దు మాటలతో నవ్వించింది మైత్రి అనే చిన్నారు. తన ముద్దు ముద్దు మాటలతో మంత్రి హరీశ్ రావుకు సోది చెప్పింది. మంత్రి హరీశ్ రావు సారుకు సోది చెప్పాలని నాకు మంత్రి గారి ఆపీసునుంచి ఫోను చేసిండ్రు…గందుకే నాంచారి తల్లి నుంచి హరీశురావు సారుకు సోది చెప్పాలని వచ్చినా అంటూ మైత్రి చెప్పిన సోదికి అందరు నవ్వుకున్నారు.
అబ్బబ్బా ఏమి జాతకమయ్యా నీదు రాజ యోగం ఉందని..20ఏళ్లకు కేసీఆర్ దగ్గర రాజకీయం నేర్చిన నీకు రాజయోగం ఉందని.. దేశానికి కేసీఆర్ పీఎం అయితే హరీశ్ రావు రాష్ట్రానికి సీఎం కావాలంది. సొంతూరు తోటపల్లి అయినా పుట్టింది చింతమడుక అంటూ చెప్పుకొచ్చింది. అసెంబ్లీ టైగర్ అయినా.. ట్రబుల్ షూటర్ అయినా హరీశ్ రావే అంటూ పలికింది చిన్నారి. 20 ఏళ్లకే మామా కేసీఆర్ దగ్గర రాజకీయాలు నేర్చిన నాయకుడంటూ ప్రశంసలు కురిపించింది. తెలంగాణ సీఎం మంత్రి హరీశ్ రావు అవుతారన్న చిన్నారి మాటలతో ఆ ప్రాంతమంతా సీఎం, సీఎం అంటూ నినాదాలు మిన్నంటాయి. లక్ష ఓట్ల మెజార్టీతో కోట్లది మంది మనస్సులు గెలుచుకున్న తండ్రి హరీశ్ రావు అంటూ తన చక్కటి మాటలతో సభను ఆహ్లాదపరిచింది చిన్నారి మైత్రి.