ఖమ్మం, కరీంనగర్ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం తర్జనభర్జన.. పోటాపోటీగా నేతల నామినేషన్లు

ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో అభ్యర్థి ఎంపికపైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తర్జనభర్జన పడుతుంది. ఈ స్థానంలో అభ్యర్థి ఎంపిక అధిష్టానంకు తలనొప్పిగా మారింది. జిల్లాలోని ముగ్గురు మంత్రులు తమ వర్గీయులకే టికెట్ ఇవ్వాలని

Lok shabha Elections 2024 : తెలంగాణలో లోక్ సభ ఎన్నికల హీట్ తారాస్థాయికి చేరింది. ఆయా పార్టీల నుంచి బీఫారంలు అందుకున్న అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నానే. రేపటితో నామినేషన్ల ప్రక్రియకూడా పూర్తవుతుంది. అయితే, అధికార కాంగ్రెస్ పార్టీ మరో మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఖమ్మం, కరీంనగర్ తో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. హైదరాబాద్ అభ్యర్థి విషయంపై ఓ క్లారిటీకి వచ్చిన అధిష్టానం.. ఖమ్మం, కరీంనగర్ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై తర్జనభర్జన పడుతోంది.

Also Read : PM Modi : తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన తేదీలు ఖరారు.. ఆ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇంకా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే, ఇప్పటికే పార్టీ తరపున వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ దాఖలు చేశారు. రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో బుధవారం మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేశారు. రాజేందర్ రావు, ప్రవీణ్ రెడ్డిలు ఇద్దరూ బీ-ఫారం తమకే వస్తుందంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వీరిద్దరిలో ఎవరికి బీఫారం అందిస్తుందన్న అంశంపై కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే, రాజేందర్ రావుకు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రాజేందర్ రావు పేరునే అధిష్టానం ఫైనల్ చేసే అవకాశాలు అధికంగా ఉన్నట్లు సమాచారం.

Also Read : TS Inter Results : తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు విడుదల

ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో అభ్యర్థి ఎంపికపైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తర్జనభర్జన పడుతుంది. ఈ స్థానంలో అభ్యర్థి ఎంపిక అధిష్టానంకు తలనొప్పిగా మారింది. జిల్లాలోని ముగ్గురు మంత్రులు తమ వర్గీయులకే టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో అమాత్యుల పంచాయితీ ఏఐసీసీకి చేరింది. రేపటితో నామినేషన్ల గడువు ముగియనుండటంతో.. ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వియ్యంకుడు రామ సహాయం రఘురాం రెడ్డి తరపున రెండు సెట్లు నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే, పారాష్యూట్ నేతలకు కాకుండా పాత కాంగ్రెస్ వాళ్లకే టికెట్ ఇవ్వాలంటూ కొందరు జిల్లా నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాయల నాగేశ్వరరావుకు టికెట్ ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్ కు వినతిపత్రం అందజేశారు.

Also Read : కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థులకు బీఫాంల అందజేత

నామినేషన్లకు రేపు చివరి రోజు కావడంతో రాయల నాగేశ్వరరావు కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ల దాఖలు చేశారు. మరో కాంగ్రెస్ నేత పోట్ల నాగేశ్వరరావు సైతం నామినేషన్ దాఖలు చేశారు. ఆశావహులంతా కాంగ్రెస్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, బీఫాం ఇచ్చిన అభ్యర్థి తప్ప మిగిలిన వారంతా నామినేషన్ ఉపసంహరించుకునే అవకాశం ఉంది. ఇదిలాఉంటే ఖమ్మం పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఇప్పికే బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావుకూడా నామినేషన్ దాఖలు చేశారు. అయితే, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం అభ్యర్థిని ప్రకటిస్తుందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ఎవరి పేరును అధిష్టానం ఫైనల్ చేస్తుందనే అంశంపై జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతోంది.

 

ట్రెండింగ్ వార్తలు