PM Modi : తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన తేదీలు ఖరారు.. ఆ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో మొదటి దశలో మూడు రోజులు ఎన్నికల ప్రచారంలో పాల్గోనున్నారు.

Lok Sabha Elections 2024 : తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. రాష్ట్రంలో అత్యధిక నియోజక వర్గాల్లో పార్టీ జెండాను ఎగుర వేసేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండటంతో.. పార్టీలోని రాష్ట్ర, జాతీయ స్థాయి అగ్రనేతలు ప్రచారపర్వంలోకి దిగనున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో మొదటి దశలో మూడు రోజులు ఎన్నికల ప్రచారంలో పాల్గోనున్నారు.

Also Read : TS Inter Results : తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు విడుదల

ఈనెల 30వ తేదీతో పాటు వచ్చే నెల 3,4 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. 30వ తేదీన హైదరాబాద్ లో వివిధ రంగాల్లో ప్రముఖలతో మోదీ సమావేశం అవుతారు. అదేరోజు అందోల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సభలో మోదీ పాల్గొంటారు. మే 3వ తేదీన వరంగల్ పార్లమెంట్ పరిధిలో నిర్వహించే సభలో పాల్గొంటారు. అదేరోజు భువనగిరి, నల్గొండ నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేసే సభల్లో పాల్గొంటారు. 4వ తేదీన మహబూబ్ నగర్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గోనున్నారు.

Also Read : Jagan Bus Yatra : శ్రీకాకుళం జిల్లాలో సీఏం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర..

రేపు (గురువారం) రాష్ట్రంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. మెదక్ పార్లమెంట్ లో రఘునందన్ రావు విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఇప్పటికే రాష్ట్రంలో రాష్ట్ర మంత్రులు పర్యటిస్తున్నారు. రేపటితో నామినేషన్ల గడువు ముగియనుండటంతో పార్టీ జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు ప్రచారంలో పాల్గోనున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు