Petrol Bunks: పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలైన్లు.. ఆందోళనలో వాహనదారులు.. ఎందుకిలా
పెట్రోల్ బంక్ దగ్గర సుమారు 100 మీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి.
- Naveen
- Published On : March 24, 2026 / 09:01 PM IST
Petrol Bunks: హైదరాబాద్ నగరంలోని పెట్రోల్ బంకుల దగ్గర భారీగా క్యూలైన్లు దర్శనం ఇస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న ఆందోళనలతో వాహనదారులు పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్నారు. రాజేంద్రనగర్ లోని ఓ పెట్రోల్ బంకులో వాహనదారులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. పెట్రోల్ బంక్ దగ్గర సుమారు 100 మీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి.
ఓవైపు బంకు సిబ్బంది పెట్రోల్ కొరత లేదని చెబుతున్నా కొన్ని ప్రాంతాల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ముందస్తు ఫిల్లింగ్ కోసం పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్నారు వాహనదారులు. ముందు జాగ్రత్తగానే ట్యాంకులు ఫుల్ చేయించుకుంటున్నామని వాహనదారులు చెబుతున్నారు. భారీ వర్షంలోనూ వాహనదారులు పెట్రోల్ బంక్ దగ్గర క్యూలో ఉన్నారు. పెట్రోల్ కొరత భయంతోనే తాము బంకుల దారి పట్టామని వాహనదారులు చెబుతున్నారు. దీనిపై తెలంగాణ పౌరసరఫరాల శాఖ స్పందించింది. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత లేదని స్పష్టం చేసింది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంది.
