Lowest Temperatures : చలి పులి…ఆదిలాబాద్‌లో 6 డిగ్రీలు…ఢిల్లీలో 4 డిగ్రీల ఉష్ణోగ్రత

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖంపడుతున్నాయి. గత నాలుగు రోజులుగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు ఉత్తర భారతదేశంలోనూ ఉష్ణో గ్రతలు తగ్గటంతో ప్రజలు చలికి వణికిపోతు

Lowest Temperatures :  తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖంపడుతున్నాయి. గత నాలుగు రోజులుగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు ఉత్తర భారతదేశంలోనూ ఉష్ణో గ్రతలు తగ్గటంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు.

తెలంగాణ‌లోని రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్‌లలో కూడా సాయంత్రం అయ్యే సరికి శీతల గాలులు వీస్తున్నాయి. హైదరాబాద్‌ బేగంపేట ప్రాంతంలో అత్యల్పంగా నిన్న 13.2 డిగ్రీలు నమోదైంది. అక్కడితో పోలిస్తే శివారు ప్రాంతాల్లో అంతకన్నా నాలుగైదు డిగ్రీలు తక్కువగా ఉంటోంది. నగర శివారు మొయినాబాద్‌ మండలం రెడ్డిపల్లిలో అత్యల్పంగా 8.5, రాజేంద్రనగర్‌లో 9.9 డిగ్రీలే ఉంది. మరో వైపు ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి. జిల్లాలోని అర్లిటీ‌లో 6.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతోంది. కుమ్రంభీమ్ జిల్లా సిర్పూర్ లో 6.4 డిగ్రీలు, గిన్నేదరిలో 6.8 డిగ్రీలు నమోదవుతోంది. జిల్లాలోని సోనాలలో 7.3 డిగ్రీలు.. పిప్పలి దరిలో 7.5 డిగ్రీలు నమోదు అయినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

అటు ఆంధ్రప్రదేశ్ లోనూ..కోస్తా తీరం వెంబడి తక్కువ ఎత్తులో ఉత్తర గాలులు వీస్తుండడం.. వీటికి అనుబంధంగా రాయలసీమ మీదుగా వీస్తున్న ఈశాన్య గాలులతో ఉష్ణోగ్రతలు రోజురోజుకీ తగ్గుతున్నాయి. రాబోయే 10 రోజుల్లో రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో 3 నుంచి 5 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
ఇక విజయనగరం, విశాఖ, రాయలసీమలోని పశ్చిమ ప్రాంతాల్లో 10 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వివరించారు.

Also Read : NSP Irrigation Canal : ఖమ్మం సాగర్ కాలువలో పడి ముగ్గురు గల్లంతు

చలి గాలులకు తోడు మంచు విపరీతంగా కురుస్తుండటంతో ఉదయం 9 గంటల వరకూ రోడ్లపైకి ప్రజలు వచ్చేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విశాఖ మన్యంలోనూ రోజురోజుకీ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. చింతపల్లిలో 5.8 డిగ్రీలు, అరకు లోయలో 9.6, మినుములూరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మరో వైపు దేశరాజధాని ఢిల్లీలో 4డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఢిల్లీ ప్రజలను చలివణికిస్తోంది. ఈరోజు ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రత 4 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 19 డ్రీగ్రీలు ఉండనున్నట్లు భారత వాతావరణ శాఖ అధికారుల వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు