Site icon 10TV Telugu

బీఆర్ఎస్ నేత, జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు తీవ్ర అస్వస్థత

మాగంటి గోపీనాథ్ (File)

మాగంటి గోపీనాథ్ (File)

బీఆర్ఎస్ నేత, జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలి AIG ఆస్పత్రిలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. నెల రోజుల క్రితం అదే ఆస్పత్రిలో ఆయన చికిత్స తీసుకున్నారు. మళ్లీ అనారోగ్యానికి గురవడంతో కుటుంసభ్యులు మాగంటిని ఆస్పత్రికి తరలించారు.

Also Read: హైదరాబాద్‌లోనూ వందలాది మంది రోడ్లపైకి వచ్చారు.. ఎవరికైనా ప్రాణనష్టం జరిగితే..?: సీపీ ఆనంద్

విషయం తెలిసిన వెంటనే హరీశ్ రావు సహా మరికొందరు బీఆర్ఎస్ నేతలు ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రస్తుతం మాగంటి గోపీనాథ్ కు చికిత్స అందుతోంది. ఆయన హెల్త్ కి సంబంధించిన అప్‌డేట్‌ ను ఆస్పత్రి వర్గాలు రిలీజ్ చేయనున్నాయి. ప్రస్తుతం మాగంటి గోపీనాథ్ కు వెంటిలేటర్ మీద చికిత్స కొనసాగుతోందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

మాగంటి గోపీనాథ్ కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ మధ్యకాలంలో నెల రోజుల పాటు AIG ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం హార్ట్ ఎటాక్ వచ్చినట్టు తెలిసింది. దీంతో ఆయనను కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.

ఆసుపత్రి వద్ద హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ… మాగంటి గోపీనాథ్ ఐసీయూలో ఉన్నారని, చికిత్స కొనసాగుతుందని చెప్పారు.

అనంతరం ఏఐజీ ఆసుపత్రికి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజ్‌ఠాకూర్‌, ముఠా గోపాల్, మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ వచ్చారు.

Exit mobile version