TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో మరొకరు అరెస్ట్..

టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్, మాస్ కాపీయింగ్ కేసులో తెలంగాణ ప్రైవేట్ కాలేజీ అసోసియేషన్ చైర్మన్‌ మహబూబ్‌ను సిట్ అధికారులు అరెస్టు చేశారు.

TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్, మాస్ కాపీయింగ్ కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు. తెలంగాణ ప్రైవేట్ కాలేజీ అసోసియేషన్ చైర్మన్‌ మహబూబ్‌ను సిట్ అధికారులు అరెస్టు చేశారు. దీంతో ఇప్పటి వరకు పేపర్ లీకేజీ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 52 మందికి చేరినట్లు సిట్ అధికారులు తెలిపారు. మహబూబ్‌కు చెందిన కాలేజ్ నుంచే మాస్ కాపీయింగ్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. పరీక్షకు హాజరుకాని అభ్యర్థుల పేపర్‌ని వాట్సాప్‌లో మహబూబ్ షేర్ చేసినట్లు గుర్తించారు.

TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో 36 మంది నిందితులపై చార్జ్ షీట్

పేపర్‌ని డీఈ పూల రమేష్‌కు షేర్ చేసినందుకు మహబూబ్ రూ.16లక్షలు తీసుకున్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. డీఈ పూల రమేష్‌కి తన కాలేజీ నుంచి పేపర్‌ని మహబూబ్ షేర్ చేయగా ఆ పేపర్‌ను రమేష్  30మందికి పంపి డబ్బులు వసూలు చేసినట్లు అధికారులు గుర్తించారు. పూల రమేష్ హైటెక్ రీతిలో మాస్ కాపీయింగ్‌లకు తెర‌లేపారు. ఏఈ పేపర్ మాస్ కాపీయింగ్ ద్వారా 10 కోట్లు సంపాదించాలని రమేష్ ప్లాన్ చేసినట్లు తెలిసింది. పరీక్షలు రాస్తున్న అభ్యర్థి నుంచి కోటిన్నరకు పైగా పూల రమేష్ అడ్వాన్స్ రూపంలో తీసుకున్నారు.