Maheshwar Reddy: కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసు

మహేశ్వర్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీ వీడే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు.

Maheshwar Reddy

Maheshwar Reddy: కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పేర్కొంది. బీజేపీ నేతలతో మహేశ్వర్ రెడ్డి సన్నిహితంగా ఉంటున్నారుంటూ నోటీసులో తెలిపింది. దీనిపై గంటలోపే వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

కాగా, మహేశ్వర్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీ వీడే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. మహేశ్వర్ రెడ్డి త్వరలోనే ఢిల్లీకి వెళ్లి బీజేపీ అధిష్ఠానాన్ని కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న తీరుపై ఆయన ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం.

మహేశ్వర్ రెడ్డి పాదయాత్రను ఆపాలంటూ కాంగ్రెస్ తెలంగాణ ఇన్ చార్జి మాణిక్ రావ్ ఠాక్రే ఇటీవల ఆదేశించారు. దీంతో ఇప్పటికే ఠాక్రేకు మాణిక్ రావ్ ఠాక్రే ఓ లేఖ రాశారు. నాలుగు రోజులు పాదయాత్ర చేసిన తర్వాత ఆపేయమన్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసమే తాను పాదయాత్ర చేశానని చెప్పారు.

తానేం సొంత ఎజెండాతో ఈ పాదయాత్రను మొదలుపెట్టలేదని తెలిపారు. పార్టీలో ఏవైనా సమస్యలు ఉంటే సరిదిద్దాల్సిందిపోయి ఇలా చేయడం బాగోలేదని చెప్పారు. తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో మహేశ్వర్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

CM Jagan : చంద్రబాబును టార్గెట్ చేసిన సీఎం జగన్