Cylinder Booking : సిలిండర్ బుకింగ్స్‌లో భారీ మార్పులు.. కొత్త రూల్స్ వచ్చేశాయ్.. ఇక్కడ తెలుసుకోండి.. ధరలు పెరుగుతాయా?
Cylinder Booking : గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. మే1వ తేదీ నుంచి గ్యాస్ సిలిండర్ విక్రయాల్లో భారీ మార్పులు రాబోతున్నాయి. ధరలు కూడా పెరిగే చాన్స్ ఉంది.
- Harishth Thanniru
- Updated on- April 27, 2026 / 11:42 AM IST
Cylinder Booking
- గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్
- మే1 నుంచి గ్యాస్ బుకింగ్‌లో కొత్త రూల్స్
- గ్యాస్ ధరలు భారీగా పెరిగే ఛాన్స్
Cylinder Booking : గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. మీరు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటున్నారా.. అయితే, ఒక్క నిమిషం ఆగండి.. ముందు ఈ విషయాలను తెలుసుకోండి. ఎందుకుంటే కేంద్ర ప్రభుత్వం సిలిండర్ బుకింగ్స్ విషయంలో భారీ మార్పులు చేసింది. ఈ కొత్త నిబంధనలు మే1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.
కొత్త నిబంధనల ప్రకారం.. పట్టణాల్లో సిలిండర్ బుకింగ్ కు 25 రోజుల గ్యాప్ తప్పనిసరి చేయబోతున్నారని తెలిసింది. అదేవిధంగా ఓటీపీ ఆధారిత డెలివరీని శాశ్వతం చేస్తారు. కాబట్టి కచ్చితంగా ఓటీపీ వచ్చి తీరాలి.. లేదంటే సిలిండర్ ఇవ్వరు.
పశ్చిమాసియాలోఉద్రికత్తల కారణంగా ఇండియన్ చమురు కంపెనీలు అమెరికా నుంచి ఎల్పీజీని దిగుమతి చేసుకుంటున్నాయి. జూన్ లేదా జులై నాటికి డెలివరీ పూర్తికానుంది. ప్రస్తుతం భారత్‌కు 80వేల టన్నుల ఎల్పీజీ రోజూ అవసరం అవుతోంది. అయితే, డొమెస్టిక్ ప్రొడక్షన్ మాత్రం రోజుకు 46వేల టన్నులు మాత్రమే ఉంది. అలాగే ఇటీవల ప్రభుత్వ చమురు, గ్యాస్ సంస్థలు కొత్త గ్యానెక్షన్లు జారీ చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఒక నెలరోజుల పాటు కొత్త గ్యాస్ కనెక్షన్లు జారీ చేయకుండా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇది తాత్కాలిక నిపివేత మాత్రమేనని, ఒక్కసారి దేశంలో పరిస్థితులు సద్దుమణిగిన తరువాత ఈ నిబంధనను తొలగిస్తామని అధికారులు చెబుతున్నారు.
ఇదిలాఉంటే.. మరో పెద్ద షాకింగ్ వార్త ఏమిటంటే.. వచ్చే నెల ప్రారంభం నుంచి మళ్లీ వంటగ్యాస్ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. చివరి దశలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఈనెల 29వ తేదీన పోలింగ్ జరగనుంది. దీంతో ఐదు రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ పూర్తికానుంది. ఎన్నికల ప్రక్రియ పూర్తికానున్న నేపథ్యంలో మే 1వ తేదీ నుంచి గ్యాస్ ధరలు మళ్లీ పెరిగే చాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. దీనిపై అధికారికంగా ఏ ప్రకటనా చెయ్యకపోయినా.. ప్రతీ నెలా 1వ తేదీన గ్యాస్ సిలిండర్ల ధరలను ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు నిర్ణయిస్తాయి. దీంతో మే 1వ తేదీన బాంబు లాంటి వార్త వినాల్సి వస్తుందేమో అనే ఆందోళన పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు ఉన్నారు.
