×
Ad

Malka Komaraiah : టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమరయ్య, శ్రీపాల్ రెడ్డి విజయం..

రెండో ప్రాధాన్యత ఓట్లతో శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు.

Malka Komaraiah : కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీకి జరిగిన ఎన్నికల్లో మల్క కొమరయ్య గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మల్క కొమరయ్యను బీజేపీ బలపరిచింది. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే మల్క కొమరయ్య గెలుపొందారు. 24వేల 144 ఓట్ల లెక్కింపులో మల్క కొమరయ్య 12వేల 959 ఓట్లు దక్కించుకున్నారు.

నల్గొండ ఖమ్మం వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. యూటీఎఫ్ బలపరిచిన అలుగుబెల్లి నర్సిరెడ్డిపై ఆయన గెలుపొందారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు.

Also Read : తెలంగాణ సీఎం మారబోతున్నారు- ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కౌంటింగ్ ఉత్కంఠభరితంగా సాగింది. మధ్యాహ్నం 12 గంటల వరకు బ్యాలెట్ పత్రాలను బండిల్ కట్టే ప్రక్రియ కొనసాగింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగింది. 11వేల 821ని గెలుపు కోటాగా నిర్ణయించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ కూడా మెజార్టీ రాలేదు. దాంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేశారు.

వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో మొత్తం 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చారు. చివరికి పులి సర్వోత్తం రెడ్డి, హర్షవర్దన్ రెడ్డి, సుందర్ రాజు ఎలిమినేట్ అవుతూ వచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి రెండో స్థానంలో ఉన్నారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో శ్రీపాల్ రెడ్డి ఘన విజయం సాధించారు. నర్సిరెడ్డి తన ఓటమిని అంగీకరించి కౌంటింగ్ కేంద్రం నుంచి వెనుదిరిగారు. ఆరేళ్లుగా తనకు అవకాశం ఇచ్చారని, ఉపాధ్యాయుల తీర్పును గౌరవిస్తున్నట్లు చెప్పారు.

Also Read : కేబినెట్‌లో ఖాళీగా ఉన్న ఆరు స్థానాలు.. ఢిల్లీకి వెళ్లి అధిష్ఠానం ముందు విన్నపాలు.. మ‌రోవైపు ప్లాన్ ‌బీ

ఉదయం నుంచి కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ.. ఐదుగురి మధ్య తీవ్రమైన పోటీ నడిచింది. ఒకవైపు బీజేపీ బలపరిచిన అభ్యర్థి పులి సర్వోత్తమ్ రెడ్డి.. పీసీసీ అధికార ప్రతినిధి, టీపీఆర్టీయూ బలపరిచిన హర్షవర్దన్ రెడ్డి, సుందర్ రాజు, పూల రవీందర్, అలుగుబెల్లి నర్సిరెడ్డి(సిట్టింగ్ ఎమ్మెల్సీ).. వీరి మధ్య ఉత్కంఠభరితమైన పోటీ నడిచింది.

 

ఇది ఉపాధ్యాయుల విజయం- శ్రీపాల్ రెడ్డి
”ఇది పూర్తిగా ఉపాధ్యాయుల విజయం. ఈ ఎన్నిక ఆషామాషీ ఎన్నిక కాదు. ఉపాధ్యాయుల ఆత్మగౌరవానికి సంబంధించిన ఎన్నిక అని నేను మొదటి నుంచి చెబుతున్నా. నేను చెప్పినట్లుగానే పూర్తి విశ్వాసం ఉంచి అధ్యాపక, ఉపాధ్యాయ మిత్రులు నాకు సంపూర్ణ సహకారం అందించడం నా జీవితంలో నేను మర్చిపోలేని విజయం.

ఇందుకు ప్రతిఫలంగా రాబోయే ఆరేళ్లు వారి సేవలో నేను నిమగ్నమై ఉంటాను. పీఆర్సీ, డీఏలు, పెండింగ్ బిల్లులు వీటిని వెంటనే పరిష్కరించే విధంగా.. దాంతో పాటు సీపీఎస్ రద్దు చేయడం, అందరికి ఆరోగ్య భద్రత కల్పిస్తూ హెల్త్ కార్డ్స్ అందించడం, దాంతో పాటుగా చాలా సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, చర్చించి, పరిష్కరించేలా నేను పని చేస్తాను” అని శ్రీపాల్ రెడ్డి చెప్పారు.