మల్లారెడ్డి అల్లుడు, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత
Marri Rajshekhar Reddy: సంఘటన స్థలానికి మర్రి రాజశేఖరరెడ్డి సహా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుకున్నారు. విద్యార్థులంతా..
- T Venkateshwarlu
- Updated on- March 7, 2024 / 02:47 PM IST
Illegal Constructions
Marri Rajashekar Reddy: తెలంగాణలోని కుత్బుల్లాపూర్ నియోజక వర్గం దుండిగల్ పురపాలక పరిధిలోని దుండిగల్ MLRIT ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కళాశాలకి చెందిన శాశ్వత భవనాలను అధికారులు కూల్చివేయిస్తున్నారు. అవి మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన కాలేజీ భవనాలు.
చిన్న దామర చెరువు ప్రాంతంలో కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు కట్టారని ఫిర్యాదులు వచ్చాయి. కలెక్టర్ ఆదేశాలతో దుండిగల్ గండి మైసమ్మ మండల రెవెన్యూ ఇరిగేషన్ మున్సిపల్ కు చెందిన మూడు శాఖల అధికారుల ఆధ్వర్యంలో భారీ భవనాల కూల్చివేతలు జరుగుతున్నాయి. కూల్చివేతలను విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
సంఘటన స్థలానికి మర్రి రాజశేఖరరెడ్డి సహా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుకున్నారు. ఆ తర్వాత అధికారులు తాత్కాలికంగా కూల్చివేతలను ఆపేశారు. కూల్చివేతలను మళ్లీ మొదలు పెడతామని అధికారులు అంటున్నారు. విద్యార్థుల పెద్దఎత్తున చేరుకోవడంతో కాసేపు కూల్చివేతలకు విరామం ఇచ్చారు అధికారులు.
అలాగే, మరింత పోలీసు ఫోర్స్ ను రప్పించారు. కాలేజీ టైం ఐపోగానే విద్యార్థులు వెళ్లిపోతే మళ్లీ కూల్చివేతలు మొదలు పెట్టేందుకు సిద్ధం అవుతున్నారు అధికారులు. తాము అన్ని నిబంధనల ప్రకారమే చేస్తున్నామని దుండిగల్ ఎమ్మెర్వో మతిన్ అంటున్నారు. ముందు మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారని, ఆ స్థలం ఇరిగేషన్ కు చెందినదని 10 టీవీతో మతిన్ చెప్పారు.
అవసరమైతే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటాను: మంత్రి గుడివాడ అమర్నాథ్
