అవసరమైతే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటాను: మంత్రి గుడివాడ అమర్నాథ్
Gudivada Amarnath: ఆ స్థానాలలో వైసీపీని గెలిపించి మళ్లీ జగన్‌ను సీఎం చేస్తానని అమర్నాథ్ చెప్పుకొచ్చారు.

Gudivada Amarnath
Gudivada Amarnath: ఈ ఎన్నికల్లో అవసరమైతే పోటీ నుంచి తప్పకుంటానని ఆంధ్రప్రదేశ్ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లిలో చేయూత చివరి విడత నిధుల విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ.. అనకాపల్లి సమన్వయకర్తగా మలసాల భరత్‌ను నియమించారని చెప్పారు.
చాలామంది తన పరిస్థితి ఎంటని, ఎక్కడి నుంచి పోటీ చేస్తావని అడుగుతున్నారని అమర్నాథ్ అన్నారు. తన పనైపోయిందని కొందరు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తాను ఒకటే చెబుతున్నానని, తనకు 15 నియోజక వర్గాల బాధ్యతలను సీఎం జగన్ అప్పగించారని అన్నారు. 15 నియోజక వర్గాలకు డిప్యూటీ రీజనల్ కోర్టినేటర్ గా నియమించారని గుర్తుచేశారు.
ఆ స్థానాలలో వైసీపీని గెలిపించి మళ్లీ జగన్‌ను సీఎం చేస్తానని అమర్నాథ్ చెప్పుకొచ్చారు. ఆయా నియోజక వర్గాల కోసం పనిచేస్తానని తెలిపారు. అందరి తలరాతలు దేవుడు రాస్తాడని, తన తలరాత మాత్రం జగన్ రాస్తారని చెప్పారు.
ఇవాళ ప్రారంభమైన వైఎస్సార్ చేయూత కార్యక్రమాన్ని ఏపీలో 14 రోజులపాటు నిర్వహించనున్నారు. సీఎం జగన్ బటన్ నొక్కి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏపీలో మండలాల వారీగా వైఎస్సార్ చేయూత పంపిణీ కార్యక్రమాలు జరుగుతాయి.
Also Read : చరిత్ర సృష్టించిన ఆ ఎమ్మెల్యే.. సినిమాల మీద పిచ్చితో ఆడిషన్స్‌కి వెళ్లి..