Police Siren
Police Siren : కరీంనగర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి సమయంలో స్నేహితులతో కలిసి మద్యం తాగుతుండగా పోలీస్ సైరన్ వినిపించడంతో పరుగెత్తి ప్రమాదవశాత్తు బావిలోపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ప్రత్యేక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. జమ్మికుంట మండలం మొత్తులగూడెంకు చెందిన వేణు (34) స్థానికంగా ఉన్న దుర్గా కాలనిలో ఉంటున్నాడు. వేణు ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో కంప్యూటర్ ఆపరేటర్ పని చేస్తున్నాడు. ఇతనికి భార్య స్వాతి, ఆరేళ్లు, మూడేళ్ల వయసున్న ఇద్దరు కూతుళ్లు అద్విక, కృత్రిక ఉన్నారు.
చదవండి : Karimnagar : రహస్య యాప్ తో భార్య ఫోన్ ట్యాపింగ్
ఆదివారం రాత్రి సమయంలో తన ముగ్గురు స్నేహితులతో కలిసి జమ్మికుంట ప్రధాన రహదారి పక్కన ఉన్న రెస్టారెంట్ ఎదురుగా కూర్చొని మద్యం సేవిస్తున్నాడు. అదే సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు సైరన్ మోగడంతో భయపడిపోయిన నలుగురు నాలుగు దిక్కులకు పరుగులు తీశారు. రాత్రి సమయంలో సరిగా కనిపించకపోవడంతో వేణు అక్కడే ఉన్న వ్యవసాయ బావిలో పడిపోయాడు.
చదవండి : Hyderabad Police : సౌండ్ పొల్యూషన్‌పై హైదరాబాద్ పోలీసుల కొరడా
బావిలో ఎదో పడినట్లు శబ్దం రావడంతో రెస్టారెంట్ లోని వారు పరుగున వెళ్లి పరిశీలించారు.. ఎంతకు ఆచూకీ దొరకలేదు. ఇదే సమయంలో కొక్కేలతో ఉన్న బకెట్‌కు తాగు కట్టి, వెతకగా వేణు ఆనవాళ్లు కనిపించాయి. దీంతో అతడిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు విద్యులు. తండ్రి మృతితో ఇద్దరు చిన్న పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.