Hyderabad Man Kill Daughter
Hyderabad Man Kill Daughter : హైదరాబాద్ చందానగర్ లో దారుణం జరిగింది. ఐదేళ్ల కుమార్తెను తండ్రి కిరాతంగా హతమార్చాడు. చిన్నారికి మాయ మాటలు చెప్పిన తండ్రి చంద్రశేఖర్ స్కూల్ నుంచి బయటికి తీసుకెళ్లాడు. అనంతరం పేపర్ కట్టర్ తో చిన్నారి గొంతు కోసి హత్య చేశాడు. మృతదేహాన్ని యాయం చేయాలనుకోగా ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురై అసలు విషయం తెలిసింది. మోక్షజ మృతిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.
మోక్షజ మృతదేహంతో చంద్రశేఖర్ కారులో తిరిగారు. ఓఆర్ఆర్ లో డివైడర్ ను కారు ఢీకొట్టింది. కొన్నేళ్లుగా భార్యతో చంద్రశేఖర్ విడిగా ఉంటున్నాడు. భార్యపై కోపంతో మోక్షజను చంపేందుకు ప్రణాళిక వేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో బయటపడిన అసలు విషయం బయటపడింది. చిన్నారి తండ్రి చంద్రశేఖర్ ను పోలీసులు అరెస్టు చేశారు.
Nandyala : కాపురానికి వెళ్లడం లేదని కూతురును హత్య చేసిన తండ్రి
ఈ మేరకు వనస్థలిపురం ఏసీపీ భీంరెడ్డి మీడియాతో మాట్లాడారు. బేబి మోక్షజ హత్య కేసు వివరాలను వెల్లడించారు. భార్య దూరం పెట్టిందన్న కసితో సొంత కూతురు మోక్షజా(8)ను తండ్రి హత మార్చాడని తెలిపారు. రాత్రి సమయంలో 10.30గంటలకు ఓఆర్ఆర్ కోహెడ వద్ద కారు యాక్సిడెంట్ అయ్యిందని సమాచారం వచ్చిందన్నారు. 2011లో హిమబిందుతో చంద్రశేఖర్ వివాహం జరిగిందని తెలిపారు.
వీరి కూతురు మోక్షజ జ్యోతి విద్యాలయ హైస్కూల్ లో 4వ తరగతి చదువుతున్నారు. CAP GEMINY కంపెనీలో అతని భార్య హిమబిందు పని చేసేదని తెలిపారు. 8 నెలలుగా భార్య దూరంగా ఉండడంతో చంద్రశేఖర్ మానసికంగా ఆందోళనకు గురయ్యాడని తెలిపారు. దీంతో కూతురును చంపాలని ముందస్తుగా పథకం రచించారు. పథకం ప్రకారం కూతురును తండ్రి చంద్రశేఖర్ హత మార్చారు.
Father Killed Daughter : అతిగా ఫోన్ మాట్లాడుతుందని.. కూతురును హత్య చేసిన తండ్రి
BHELలో హిమబిందు తల్లి ఇంటి దగ్గర ఉంటుంది. మూడు రోజులకు ఒకసారి పాపను చూడడానికి తండ్రి చంద్రశేఖర్ వెళ్తున్నారు. ఆర్ధిక ఇబ్బందులు తొడవ్వడంతో అతని భార్య హిమబిందుపై ఉన్న కోపంతో కూతురు మోక్షజను పేపర్ కట్టర్ కత్తిని చందానగర్ లో కొనుగోలు చేశారు. అనంతరం చిన్నారిని తన తండ్రి కారులో హత మార్చారు.
అక్కడి నుండి ఓఆర్ఆర్ కోహెడ సమీపంలో చేరుకొని అక్కడ మోక్షజను డిపోజ్ చేసే క్రమంలో కారు డివైడర్ ను ఢీ కొట్టింది. 100 డయల్ కు సమాచారం అందడంతో పోలీసుల అక్కడికి చేరుకొని చంద్రశేఖర్ ను విచారించగా పుర్తి వివరాలు బయటికి వచ్చాయని తెలిపారు. నిందితుడిని tayata Etios కారు, షార్ప్ పెన్సిల్, పేపర్ కట్టర్ కత్తి, ఒక మొబైల్స్ ఫోన్ స్వాదినం చేసుకొని తరలిస్తామని ఏసీపీ భీం రెడ్డి పేర్కొన్నారు.