Trains Cancellation: ఉమ్మడి వరంగల్ జిల్లా మీదుగా నడిచే పలు రైళ్లు రద్దు.. ఎప్పటి వరకు అంటే?

హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైళ్లతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

Trains Cancellation

South Central Railway: ఉమ్మడి వరంగల్ జిల్లా మీదుగా నడిచే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. వీటిలో హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైళ్లతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లు కూడా రద్దయ్యాయి. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని రోలింగ్ కారిడార్ బ్లాక్ కార్యాచరణ ఉన్నందున దక్షిణ మధ్య రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈనెల 10 నుంచి 16వ తేదీ వరకు  రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా 17 ఎంఎంటీఎస్ రైళ్లు కూడా రద్దయ్యాయి. గత నెల 19వ తేదీ నుంచి పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. అయితే, పనులు పూర్తికాకపోవటంతో ఆ రైళ్ల రద్దును ఈ నెల 16వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

రద్దయిన రైళ్ల వివరాలు ..

కాజీపేట – డోర్నకల్ (07753).
డోర్నకల్ – కాజీపేట (07754) మెము.
డోర్నకల్ – విజయవాడ (07755).
విజయవాడ – డోర్నకల్ (07756) మెము.
భద్రాచలం రోడ్ – విజయవాడ (07278).
విజయవాడ – భద్రాచలం రోడ్ (07979) మెము.
సికింద్రాబాద్ – వరంగల్ (07462).
వరంగల్ – హైదరాబాద్ (07463) మెము.
కాజీపేట – సిర్పూర్ టౌన్ (17003),
బల్లార్హా – కాజీపేట (17004)రాంగిరి మెము,
భద్రాచలం రోడ్ – బల్లార్షా (17033).
సిర్పూర్ టౌన్ – భద్రాచలం రోడ్ (17034) సింగరేణి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఉన్నాయి.

అదేవిధంగా లింగంపల్లి – హైదరాబాద్ రూట్లలో ప్రయాణించే పలు ఎంఎంటీఎస్ రైళ్లు, హైదరాబాద్ – లింగంపల్లి, ఉందానగర్ – లింగంపల్లి, లింగంపల్లి – ఉందానగర్, లింగంపల్లి – ఫలక్ నూమా, ఫలక్ నూమా – లింగంపల్లి, రామచంద్రాపురం – ఫలక్ నూమా రూట్లలో ప్రయాణించే పలు ఎంఎంటీఎస్ రైళ్లను వారం రోజులు పాటు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.