Maoist Letter
Maoist Letter In Mulugu : ములుగు జిల్లాలో మావోయిస్టు లేఖ కలకలం రేపుతోంది. జగన్నాథపురం వై జంక్షన్ వద్ద మావోయిస్టు లేఖ లభ్యమైంది. సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ పేరుతో మావోయిస్టులు లేఖను విడుదల చేశారు. ధరణి పోర్టల్ తో రైతులను దివాలా తీయిస్తున్నారంటూ లేఖలో ప్రస్తావించారు. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ విప్లవం జరుగకుండా రైతుల సమస్యలను పరిష్కరించడం సాధ్యం కాదని పేర్కొన్నారు.
పాత, కొత్త భూస్వాములు, కాంట్రాక్టర్లు, గ్రామ పరిపాలకవర్గం కలిసి ఒక వ్యవస్థగా ఏర్పడి ప్రజలను అన్ని రకాలుగా పీడిస్తున్నారని విమర్శించారు. పోలీస్ స్టేషన్లు పంచాయితీలు చేసే అడ్డాలుగా మారాయని లేఖలో ప్రస్తావించారు. మావోయిస్టు లేఖపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇటీవల ధరణి పోర్టల్ పై ఒకవైపు కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తోంది.
Warning Letters : ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలకు.. మావోయిస్టులు, అజ్ఞాత వ్యక్తులు వార్నింగ్ లెటర్స్
మరోవైపు ధరిణి పోర్టల్ ద్వారానే రైతులకు మేలు జరుగుతుందని అధికార బీఆర్ఎస్ పార్టీ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా మావోయిస్టులు ములుగు జిల్లా వాజేడు రహదారిపై ధరణి పోర్టల్ పై లేఖ, కరపత్రాలను విడుదల చేశారు. ఈ లేఖ, కరపత్రాలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.