కట్నం వేధింపులు తాళలేక నవ వధువు ఆత్మహత్య.. భర్తతో ఫోన్ కాల్ మాట్లాడుతూ మృతి
- bheemraj
- Published On : January 3, 2021 / 02:06 PM IST
married woman commit suicide due to dowry harassment : నల్గొండ జిల్లాలోని కేతెపల్లి మండలం కొర్లపహాడ్‌లో దారుణం జరిగింది. కట్నం వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. గత కొన్ని రోజుల క్రితం సూర్యాపేటకు చెందిన ప్రణయ్ ను ప్రేమ వివాహం చేసుకుంది.
ప్రేమ పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని రోజులు సాఫీగా సాగుతున్న తరుణంలో తన భర్త కట్నం కావాలంటూ వేధింపులకు గురిచేశాడు. దీంతో వేధింపులు భరించలేక తీవ్ర మనస్తాపానికి గురైన నవ వధువు ఆత్మహత్య చేసుకుంది.
చనిపోయే ముందు లావణ్య తన భర్త ప్రణయ్‌కు కాల్ చేసింది. కాల్ మాట్లాడుతున్న సమయంలోనే లావణ్య చనిపోయింది. ఈ విషయంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
