Abids Fire Incident : అబిడ్స్‎లో భారీ అగ్ని ప్రమాదం.. భయంతో స్థానికుల పరుగులు.. వీడియో వైరల్!

Abids Fire Incident : అబిడ్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. క్రాకర్స్ పేలడంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి.

Massive Fire Incident at Abids

Abids Fire Incident : హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బొగ్గులకుంట క్రాకర్స్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అబిడ్స్ బొగ్గులకుంట నుంచి కోఠి హనుమాన్ ఆలయానికి వెళ్లే మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. క్రాకర్స్ పేలడంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. దాంతో క్రాకర్స్ దుకాణంలోని వారితో పాటు స్థానికులంతా భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.

4 ఫైరింజన్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది క్రాకర్స్ షాపులో ఎగసిపడుతున్న మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనలో ఇద్దరు మహిళలు తీవ్ర అస్వస్థత గురికాగా వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. క్రాకర్స్ షాపులో బాణాసంచా ఎక్కువ మొత్తంలో ఉండటంతో మంటలు చెలరేగుతున్నాయి. ఫైర్ క్రాకర్స్ షాప్ పక్కన ఉన్న హోటల్‎కు కూడా మంటలు వ్యాపించడంతో మరింత భయాందోళనకరంగా మారింది.

ఈ మంటలు బయటకు ఎగసిపడటంతో అక్కడే పార్క్ చేసిన పలు వాహనాలు మంటల్లో దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదంలో భారీ ఆస్తి నష్టం వాటిలినట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also : Digital Arrest Fraud : ‘డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్’తో తస్మాత్ జాగ్రత్త.. దేశ ప్రజలను హెచ్చరించిన ప్రధాని మోదీ.. ఈ 3 దశలు తెలుసుకోండి!