×
Ad

Rajanna Siricilla : బ్లఫ్ మాస్టర్ సినిమా తరహాలో ఘరానా మోసం.. రూ.50 కోట్లకు కుచ్చు టోపీ

ఆన్ లైన్ బిజినెస్ లో తక్కువ ధరకే ఎలక్ట్రానిక్ వస్తువులు ఇంటికి డోర్ డెలివరీ చేస్తానని బురిడీ కొట్టించాడు. Rajanna Siricilla

  • Published On : July 29, 2023 / 05:37 PM IST

Rajanna Siricilla

Rajanna Siricilla District : రాజన్న సిరిసిల్ల పోలీసులు ఓ కేటుగాడిని అదుపులోకి తీసుకున్నారు. బ్లఫ్ మాస్టర్ సినిమా తరహాలో మోసాలకు పాల్పడ్డాడు రమేశ్ చారి. ఈజీ మనీకి అలవాటు పడి కోట్ల రూపాయలు వసూలు చేశాడు. కరీంనగర్ జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ కి చెందిన రమేశ్ చారి వందలాది మందికి కుచ్చు టోపీ పెట్టాడు.

Kerala Road Accident : రోడ్డు దాటుతున్నారా? బీకేర్ ఫుల్.. రెప్పపాటులో ఘోరం జరిగిపోయింది.. ఒళ్లుగగుర్పొడిచే యాక్సిడెంట్ వీడియో

గతంలో కేసీఆర్ సేవా దళ్ రాష్ట్ర సలహాదారుడిగా ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగుల దగ్గర డబ్బులు వసూలు చేశాడు. ఇటీవల ఆన్ లైన్ బిజినెస్ లో తక్కువ ధరకే ఎలక్ట్రానిక్ వస్తువులు ఇంటికి డోర్ డెలివరీ చేస్తానని బురిడీ కొట్టించాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వ్యాపారం పేరుతో వ్యాపారస్తులకు కుచ్చుటోపీ పెట్టాడు. ఇలా ప్రతిదీ మోసమే. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.

Also Read..Vijayawada : చిట్టీలు కడుతున్నారా? బీకేర్ ఫుల్.. విజయవాడలో భారీ మోసం, రూ.5కోట్లకు టోకరా

50శాతం లాభం వస్తుందని చెప్పి వేములవాడ ఎల్లారెడ్డి పేటకు చెందిన వ్యాపారస్తుల దగ్గర డబ్బు వసూలు చేశాడు రమేశ్ చారి. చాలామంది వ్యాపారస్తులు, ఉద్యోగులు రమేశ్ చారిని నమ్మి డబ్బులు పెట్టి మోసపోయారు. లక్షల రూపాయలు అప్పులు చేసి పెట్టుబుడి పెట్టి దగా పడ్డారు. ఈ బ్లఫ్ మాస్టర్ బాధితులు 50మందికిపైనే ఉన్నట్లు తెలుస్తోంది. తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. చివరికి రమేశ్ చారి బాధితుల పేర ఓ వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటు చేసుకున్నారు. మొత్తానికి హైదరాబాద్ లో కేటుగాడిని అదుపులోకి తీసుకున్నారు రాజన్న సిరిసిల్ల పోలీసులు. రమేశ్ చారి రాష్ట్రవ్యాప్తంగా 50 కోట్ల రూపాయల వసూళ్లకు పాల్పడినట్లు బాధితులు చెబుతున్నారు.