పాక్‌తో ఉద్రిక్తతల వేళ హైదరాబాద్‌, విశాఖ సహా దేశంలోని ఈ నగరాల్లో మాక్‌ డ్రిల్స్‌.. మాక్ డ్రిల్స్ అంటే ఏంటి? జనం ఏం చేయాలి?

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో మే 7న మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించాలని సూచించిన విషయం తెలిసిందే. శత్రుదేశాల దాడుల సమయంలో అమలు చేసే పౌర రక్షణ చర్యలను బలోపేతం చేయడం, పరీక్షించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ మాక్‌ డ్రిల్స్‌లో ఎయిర్‌ రైడ్‌ సైరన్‌ పరీక్షలు, పౌర శిక్షణా కార్యక్రమాలు, బ్లాక్‌అవుట్‌ ప్రొటోకాల్‌లపై అవగాహన కల్పించడం, ప్రజల తరలింపు రిహార్సల్స్‌ వంటి అంశాలు ఉంటాయి. ఈ మాక్‌ డ్రిల్లులో ఎయిర్‌ రైడ్‌ సైరన్‌ పరీక్షలు, పౌర శిక్షణా కార్యక్రమాలు, బ్లాక్‌అవుట్‌ ప్రొటోకాల్‌లు, ప్రజల తరలింపు వంటి అంశాలు ఉంటాయి.

మాక్‌ డ్రిల్‌పై ఇవాళ కేంద్ర హోంశాఖ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి అన్ని రాష్ట్రాల సెక్రటరీలు, డీజీపీలు, ఫైర్‌ డీజీలతో మాట్లాడింది. ఏయే ప్రాంతాల్లో మాక్‌ డ్రిల్‌ నిర్వహించాలో తెలిపింది. మాక్ డ్రిల్స్‌ చేయాల్సిన జిల్లాలను మూడు కేటగిరీలుగా విభజించింది. మాక్ డ్రిల్స్‌ తొలి జాబితాలో అణు విద్యుత్ కేంద్రాలు ఉన్న జిల్లాలు ఉన్నాయి.

  • తొలి లిస్టులో ఉన్న ప్రాంతాలు మొత్తం 13. అవి ఢిల్లీ, ముంబై, సూరత్, వడోదర, కక్రాపూర్, తారాపూర్, తాల్చేర్, కోట, రావత్, చెన్నై, కల్పక్కం, నగోరా
  • రెండో జాబిలాలో హైదరాబాద్‌, విశాఖపట్నం సహా 201 జిల్లాలు ఉన్నాయి
  • మూడో జాబితాలో 45 జిల్లాలు ఉన్నాయి

ఇలాంటి మాక్‌ డ్రిల్లులను సాధారణంగా యుద్ధ పరిస్థితులు లేదా వైమానిక దాడులకు ముందస్తుగా సిద్ధంగా ఉండేందుకు నిర్వహిస్తారు. వైమానిక దాడి ప్రమాదాన్ని సూచించేందుకు సైరన్లు మోగిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఏం చేయాలో వారికి శిక్షణ ఇస్తారు. క్రాష్‌ బ్లాక్‌అవుట్‌ అనే ప్రక్రియను కూడా ప్రజలకు వివరించనున్నారు. దీనిలో భాగంగా శత్రు దేశ వైమానిక దాడుల సమయంలో రాత్రిపూట భూమిపై ప్రదేశాలు కనిపించకుండా అన్ని లైట్లను ఆర్పివేస్తారు.

మాక్‌డ్రిల్స్‌ ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఇలా జరుగుతున్నాయి..

 

మాల్‌ డ్రిల్స్ నిర్వహించే ప్రాంతాల పూర్తి లిస్ట్