Telangana : రానున్న మూడు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు

వేడి గాలుల మూలంగా తెలంగాణలోని ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, రామగుండంతోపాటు ఏపీలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగనున్నట్లు పేర్కొంది.

  • Published On : May 13, 2023 / 08:04 AM IST

temperatures

Maximum temperatures : తెలంగాణలో రానున్న మూడు రోజులు ఎండల తీవ్రత అధికంగా ఉండనుంది. పశ్చిమ దిశ నుంచి వీస్తోన్న వేడి గాలులతో రానున్న మూడు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణం కేంద్రం వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

వేడి గాలుల మూలంగా తెలంగాణలోని ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, రామగుండంతోపాటు ఏపీలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగనున్నట్లు పేర్కొంది. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

West Bengal : ఎండ వేడితో ఆమ్లెట్, పాప్ కార్న్ వండేస్తున్న వెస్ట్ బెంగాల్ జనం.. ఎండలు మామూలుగా లేవుగా..

శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 42.3 డిగ్రీలు, నల్గొండలో 42, మెదక్ లో 41, నిజామాబాద్ లో 40.8, రామగుండంలో 40.6 హన్మకొండలో 39.5, హైదరాబాద్ లో 38.7, భద్రాచలంలో 38.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది.