Drunk And Drive: మందుబాబులకు బిగ్ అలర్ట్.. ఇకపై డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే జైలుకే.. కోర్టు సంచలన తీర్పు!

మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్(Drunk And Drive) తనిఖీల్లో పట్టుబడిన ఐదుగురికి జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ మేడ్చల్ న్యాయస్థానం కఠిన తీర్పు వెలువరించింది.

Medchal court sentences five to jail in drunk and drive cases

Drunk And Drive: మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న మందుబాబుల ఆటకట్టించేందుకు ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో డ్రంక్ అండ్ డ్రైవ్(Drunk And Drive), డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతూ పట్టుబడిన 8 మందిపై కేసులు నమోదు చేశారు. నిందితులను మేడ్చల్‌లోని జూనియర్ సివిల్ జడ్జి-కమ్-VII అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా, విచారణ చేపట్టిన న్యాయస్థానం కఠిన తీర్పును వెలువరించింది.

Sabarimala Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. శబరిమలకు 54 ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలు మీకోసం!

ఒకరికి 10 రోజులు, నలుగురికి 4 రోజుల జైలు.. భారీగా జరిమానా:

ఈ కేసుల విచారణలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన ఆరుగురికి మొత్తం రూ.4,500 జరిమానా విధించడంతో పాటు, తీవ్రతను బట్టి ఐదుగురికి జైలు శిక్ష ఖరారు చేశారు. ఇందులో ఒకరికి 10 రోజుల జైలు శిక్ష, మరో నలుగురికి 4 రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన ఇద్దరు వ్యక్తులకు రూ.2,000 జరిమానా విధించారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.. మేడ్చల్ ట్రాఫిక్ పోలీసుల హెచ్చరిక:

ఈ సందర్భంగా మేడ్చల్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు కీలక సూచనలు చేశారు. వాహనదారులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదని స్పష్టం చేశారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టవద్దని పోలీసులు హెచ్చరించారు.