తెలంగాణలో కరోనా : 24 గంటల్లో 948 కేసులు, 1,896 మంది రికవరీ

  • Publish Date - October 19, 2020 / 10:19 AM IST

COVID 19 in Telangana : తెలంగాణలో కరోనా తోక ముడుస్తున్నట్లే ఉంది. రోజు రోజు కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తొలుత 3 నుంచి 5 వేల కేసులు నమోదువుతుండగా..రాను రాను..ఆ సంఖ్య 2 వేలకు చేరుకుంది. క్రమంగా..వేయి పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి.



తాజాగా 24 గంటల్లో 948 కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. మొత్తం ఇప్పటి వరకు 2,23,059 కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 1,896 మంది రికవరీ అయ్యారు. ఇప్పటి వరకు రికవరీ అయిన వారి సంఖ్య 2,00,686కు చేరుకుంది. నలుగురు మృతి చెందారు. మరణించిన వారి సంఖ్య 1275కు చేరుకుంది.



కోలుకున్న వారి రేటు 89.96గా ఉందని, మొత్తం ఆక్టివ్ కేసుల సంఖ్య 21,098గా ఉందని వెల్లడించింది. హోం / సంస్థలలో గల వ్యక్తుల సంఖ్య 17, 432గా ఉందని తెలిపింది.



జిల్లాల వారీగా కేసులు : –
ఆదిలాబాద్ 09. భద్రాద్రి కొత్తగూడెం 56. జీహెచ్ఎంసీ 212. జగిత్యాల 22. జనగామ 11. జయశంకర్ భూపాలపల్లి 07. జోగులాంబ గద్వాల 09. కామారెడ్డి 04. కరీంనగర్ 63. ఖమ్మం 25. కొమరం భీం ఆసిఫాబాద్ 0. మహబూబ్ నగర్ 11.



మహబూబాబాద్ 15. మంచిర్యాల 09. మెదక్ 06. మేడ్చల్ మల్కాజ్ గిరి 65. ములుగు 14. నాగర్ కర్నూలు 11. నల్గొండ 35. నారాయణపేట 2. నిర్మల్ 05. నిజామాబాద్ 29. పెద్దపల్లి 14. రాజన్న సిరిసిల్ల 09. రంగారెడ్డి 98. సంగారెడ్డి 42. సిద్దిపేట 54. సూర్యాపేట 28. వికారాబాద్ 05. వనపర్తి 11. వరంగల్ రూరల్ 11. వరంగల్ అర్బన్ 46. యాదాద్రి భువనగిరి 10. మొత్తం : 948