సీఎం కేసీఆర్‌‌కు యశోద ఆసుపత్రిలో వైద్య పరీక్షలు.. లంగ్స్‌లో మైల్డ్‌ ఇన్‌ఫెక్షన్‌

Medical examination for Telangana CM KCR at Yashoda Hospital : తెలంగాణ సీఎం కేసీఆర్‌‌కు యశోద ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. ఊపరితిత్తుల్లో మంటగా ఉండటంతో ఆయనకు సికింద్రాబాద్‌ యశోద ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌‌తో పాటు.. 2D ఎకో పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం.. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌కు వెళ్లిపోయారు.

సీఎం కేసీఆర్‌కు ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహించారు? టెస్ట్ రిపోర్ట్స్ ఏంటనే విషయంపై యశోద ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ఎంవీ రావ్‌ టెన్ టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. సీఎం కేసీఆర్‌కు లంగ్స్‌లో మైల్డ్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉందని పేర్కొన్నారు.

ఐదు రోజులకు మెడిసిన్‌ ఇచ్చామని తెలిపారు. బ్లడ్‌ రిపోర్ట్స్‌, 2డి ఎకో రిపోర్టులు రావాలన్నారు. కేసీఆర్‌కు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు.