Medipally Swathi Case : మేడిపల్లి స్వాతి హత్య కేసులో సంచలన విషయాలు.. తల పడేయడానికి ఇటుకలు.. కాళ్లు పడేయడాని పది కిలోల రాయి.. వింటుంటేనే..

Medipally Swathi Case : స్వాతిని హత్య చేసిన తర్వాత ముందుగానే కొనుగోలు చేసి ఉంచిన హాక్సా బ్లేడ్‌తో ఆమె శరీర భాగాలను నిందితుడు వేరు చేశాడు

Medipalli Swathi case

Medipally Swathi Case : గర్భిణి అయిన భార్య స్వాతిని ఆమె భర్త మహేందర్ రెడ్డి అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన మేడిపల్లి బాలాజీహిల్స్‌లో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. భార్య మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి వాటిని నిందితుడు మూసీ నదిలో పడేశాడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే, నిందితుడు మహేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ క్రమంలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.

Also Read: Medchal district : భార్యను ముక్కలు చేసిన కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు.. ఆ 25 రోజుల్లో ఏం జరిగింది.. మృతురాలి తల్లి ఏం చెప్పారంటే..

స్వాతిని హత్య చేసిన తర్వాత ముందుగానే కొనుగోలు చేసి ఉంచిన హాక్సా బ్లేడ్‌తో ఆమె శరీర భాగాలను మహేందర్ రెడ్డి వేరు చేశాడు. చెత్త తీసుకెళ్లే బ్లాక్ కవర్లల్లో కాళ్ళు, చేతులు, తల విడివిడిగా మూడు కవర్లలో వేశాడు. ఇంటిపైన ఉన్న ఇటుకలు తెచ్చి తలకు తాడుతో కట్టాడు. ఆ కవర్‌ను బ్యాగ్‌లో వేసుకున్నాడు. చేతులున్న కవర్‌ను బస్తాలో వేసుకొని బైక్ పై పెట్టుకున్నాడు. ఈ రెండు కవర్లను ప్రతాపసింగారం వద్ద ఉన్న మూసీలో విసిరేశాడు. రెండు కాళ్లను ఆ రాయికి కట్టి.. యూరియా బస్తాలో మూట కట్టాడు. తీసుకెళ్లి మూసీలో వేశాడు.

స్వాతి మొబైల్ తీసుకుని.. స్వాతి చెల్లి శ్వేతకి తిన్నారా అని మెసేజ్ చేశాడు. స్వాతి మెసేజ్ చేసినట్లు నమ్మించాడు. మేడిపల్లిలోని ఓ పాన్ షాప్ దగ్గర ఆగి.. సిగరెట్ తాగుతూ.. తన చెల్లికి ఫోన్ చేశాడు. స్వాతి గొడవపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని చెప్పాడు. ఇంట్లో ఉన్న స్వాతి మొండేన్ని ఏం చేయాలని ఆలోచిస్తున్న తరుణంలోనే నిందితుడు బంధువు గోవర్ధన్ రెడ్డి వచ్చి.. స్వాతీ ఎక్కడికి వెళ్లిందని ప్రశ్నించాడు.

ఆ తరువాత ఇద్దరూ కలిసి మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో స్వాతి అదృశ్యం అయిందని ఫిర్యాదు చేశాడు. స్వాతి ఎందుకు వెళ్లిపోయింది.. ఏమైనా గొడవ జరిగిందా.. నువ్వేమైనా చేశావా.. అంటూ పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో భయపడిపోయిన నిందితుడు మహేందర్ రెడ్డి.. నా భార్యను నేనే హత్య చేశానని ఒప్పుకున్నాడు.

నిందితుడు మహేందర్ రెడ్డిని పోలీసులు శనివారం అర్ధరాత్రి తరువాత అదుపులోకి తీసుకొని స్టేషన్ లో ఉంచారు. ఆదివారం తెల్లవారుజామున 4గంటల వరకూ వేచిఉన్న నిందితుడు.. స్వాతి శరీర భాగాలు ఎక్కడ పారవేశారో చూపించాలని పోలీసులు అడగడంతో.. సర్ నిద్ర వస్తోందంటూ పోలీసులను అడిగాడు. అయితే, స్వాతి శరీర భాగాల కోసం గాలింపు కొనసాగుతుంది. స్వాతి మొండేనికి పోస్టుమార్టం పూర్తి చేసి.. కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితుడు మహేందర్ రెడ్డిని కోర్టులో హాజరుపర్చిన పోలీసులు చర్లపల్లి జైలుకు సోమవారం రిమాండ్ కు పంపించారు.