Mega Job Mela
Mega Job Mela : నిరుద్యోగ యువతీ, యువకులకు శుభవార్త. మెగా జాబ్‌మేళా నిర్వహణకు అన్నిఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ జాబ్ మేళాలో 150కంపెనీలు భాగస్వామ్యం అవుతుండగా.. 10వేల మందికిపైగా నిరుద్యోగులు ఈ మేళాలో పాల్గొనేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఇరిగేషన్, సివిల్ సప్లయ్ శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు.
హుజూర్‌నగర్ పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వెనుకగల స్కూల్లో ఈనెల 25వ తేదీన ఈ మెగా జాబ్‌మేళా జరగనుంది. ఈ జాబ్‌మేళాకు సంబంధించిన పోస్టర్‌ను మంత్రి ఉత్త్‌మ్ కుమార్ రెడ్డి సెక్రటేరియెట్‌లో డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సిసిఎల్) సహకారంతో నిర్వహించబడుతున్న ఈ మేళాను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభిస్తారని చెప్పారు.
ఈనెల 25న జరగనున్న జాబ్‌మేళాలో 150 కంపెనీలు భాగమవుతాయని, 10వేల మందికిపైగా నిరుద్యోగులు ఈ జాబ్‌మేళాలో పాల్గొనే అవకాశం ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఐటీ, మాన్యుఫ్యాక్చరింగ్, సర్వీసెస్, ట్రేడింగ్, ఫార్మా, బ్యాంకింగ్ సహా వివిధ రంగాలకు చెందిన కంపెనీలు ఈ జాబ్ మేళాలో భాగస్వామ్యం అవుతాయని చెప్పారు.
నిరుద్యోగులకోసం జాబ్‌మేళా జరిగే చోట హెల్ప్‌డెస్క్‌తో పాటు ఆన్‌లైన్ సేవలు అందించేందుకు ఏర్పా ట్లు చేస్తున్నామని మంత్రి తెలిపారు. అవసరమైన చోట కంప్యూటర్లు, ప్రింటర్లు, జిరాక్స్ మిషన్ లు ఏర్పాటు చేయలని డీట్ అధికారులకు మంత్రి సూచించారు.
టెన్త్ పాస్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ, బీటెక్, పీజీ, ఫార్మసీ కోర్సుల్లో ఉత్తీర్ణత పొందిన వారు, 18 నుంచి 40ఏళ్ల వయస్సు కలిగిన వారు ఈ జాబ్ మేళాలో పాల్గొనేందుకు అర్హులు.