MEIL Oxygen Tankers : హైదరాబాద్ చేరుకున్న క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు, థాయ్‌లాండ్ నుంచి తెప్పించిన మేఘా

దేశంలో ఆక్సిజన్ కొరతను నివారించేందుకు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL) నడుం బిగించింది. థాయ్ లాండ్ నుంచి 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు దిగుమతి చేసుకుంటోంది. మొదటి విడతగా మూడు క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు లోడ్ చేసుకున్న డిఫెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ హైదరాబాద్ బేగంపేటకు చేరుకుంది.

MEIL Cryogenic Oxygen Tankers : దేశంలో ఆక్సిజన్ కొరతను నివారించేందుకు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL) నడుం బిగించింది. థాయ్ లాండ్ నుంచి 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు దిగుమతి చేసుకుంటోంది. మొదటి విడతగా మూడు క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు లోడ్ చేసుకున్న డిఫెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ హైదరాబాద్ బేగంపేటకు చేరుకుంది.

ఈ ట్యాంకర్లను MEIL సంస్థ ప్రభుత్వానికి ఉచితంగా ఇవ్వనుంది. దేశంలో ఈ తరహాలో క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను దిగుమతి చేసుకుని ప్రభుత్వానికి అందిస్తున్న తొలి సంస్థగా MEIL రికార్డు నెలకొల్పింది. ఒక్కో క్రయోజనిక్ ట్యాంకర్ కోటి 40 లక్షల లీటర్ల ఆక్సిజన్ ను అందిస్తుంది.

ట్రెండింగ్ వార్తలు