Viral Video: మా ఆవేదన వినే నాథుడే లేడా? టీఎస్ఆర్టీసీ బస్సులో పురుషుల బాధలు వర్ణనాతీతం

ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అసలే సీట్ల కోసం ఆర్టీసీ బస్సుల్లో మహిళలు సిగలు పట్టుకుని..

Viral Video

తెలంగాణ వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో బస్సులన్నీ నిండిపోతున్నాయి. మహిళలతో బస్సులు కళకళలాడుతుండడంతో పురుషులకు సీట్లు దొరకడం లేదు. మహిళల సీట్లో పురుషులు కూర్చుంటే వారిని లేపి వెనక్కి పంపిచేస్తారు. పురుషుల సీట్లో మహిళలు కూర్చుంటే మాత్రం ఆడవాళ్లను అడిగేవారే ఉండరు. వృద్ధుల కోసం కేటాయించే సీట్లూ ఖాళీగా ఉండడం లేదు.

బస్సులు కిక్కిరిపోతుండడంతో వృద్ధులు కూడా నిలబడే కిలోమీటర్ల కొద్దీ ప్రయాణం చేయాల్సి వస్తుంది. మోకాళ్ల నొప్పులు వేధిస్తున్నా, నిలబడే బలం లేకున్నా బస్సుల్లో ప్రయాణిస్తూ తలప్రాణం తోకకు తెచ్చుకుంటున్నామని వృద్ధులు వాపోతున్నారు.

చేతులు, కాళ్లు వణుకుతున్నప్పటికీ నిలబడే ప్రయాణం చేయాల్సి వస్తోందని ఓ వృద్ధుడు చెప్పారు. యువకులు సైతం ఇంకా ఎన్నాళ్లు నిలబడి ప్రయాణం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు కొన్ని రోజులుగా బస్సులో సీటు దొరకడం లేదని తమ బాధ ఎవరికి చెప్పుకోవాలని ఓ యువకుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అసలే సీట్ల కోసం ఆర్టీసీ బస్సుల్లో మహిళలు సిగలు పట్టుకుని కొట్టుకుంటున్నారు. దానికి తోడు అదే బస్సులో నిలబడి ప్రయాణిస్తున్న వృద్ధుల బాధలు వర్ణనాతీతంగా మారాయి.

Also Read: గోపిక ఏంటి ఇంతలా మారిపోయింది.. గుర్తు పట్టలేనంతగా