Gopika : గోపిక ఏంటి ఇంతలా మారిపోయింది.. గుర్తు పట్టలేనంతగా

ఆటోగ్రాఫ్ సినిమాలో లతిక పాత్రలో నటించిన గోపిక గుర్తున్నారా? సోషల్ మీడియాలో గోపిక ఫ్యామిలీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. గోపిక గుర్తుపట్టలేనంతగా మారిపోయారు.

Gopika : గోపిక ఏంటి ఇంతలా మారిపోయింది.. గుర్తు పట్టలేనంతగా

Actress Gopika

Updated On : February 16, 2024 / 3:02 PM IST

Gopika : ‘నా ఆటోగ్రాఫ్’ సినిమా చూసిన వాళ్లు లతిక పాత్రలో నటించిన గోపికను మర్చిపోరు. మోడల్‌గా కెరియర్ ప్రారంభించిన గోపిక ‘ప్రణయమణిథూవల్’ అనే మళయాళ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌కి ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో కూడా నటించిన గోపిక పెళ్లైన తరువాత సినిమాలకు దూరమయ్యారు. రీసెంట్‌గా గోపిక ఫ్యామిలీ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ చూసిన నెటిజన్లు గోపిక ఏంటి? ఇంతలా మారిపోయారు.. అని ఆశ్చర్యపోతున్నారు.

Actress Gopika

Actress Gopika

charmmekaur : ఆమె మరణాన్ని తట్టుకోలేకపోతున్నా.. ఛార్మీ ఎమోషనల్ పోస్టు

రవితేజ, గోపిక ప్రధాన పాత్రల్లో 2004 లో వచ్చిన ‘నా ఆటోగ్రాఫ్’ సినిమా అందరికీ గుర్తుండిపోయింది.  ఈ సినిమా తర్వాత గోపికకు తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది. లేత మనసులు, ముద్దుల కొడుకు, వీధి, వీడు మామూలోడు కాదు వంటి సినిమాల్లో నటించారు. సినిమాలు చేస్తుండగానే సడెన్‌గా గోపిక పెళ్లి చేసుకున్నారు. 2008 లో ఉత్తర ఐర్లాండ్‌లో పనిచేస్తున్న డాక్టర్ అజిలేష్ చాకోతో గోపికకు పెళ్లైంది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం వీరి కుటుంబం ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో సెటిల్ అయ్యింది. పెళ్లయిన చాలా సంవత్సరాల తర్వాత గోపిక ఫ్యామిలీ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Actress Gopika 2

Actress Gopika 2

Keerthy Suresh : నడుము అందాలతో ఆకట్టుకుంటున్న కీర్తి సురేష్..

గోపిక ఫ్యామిలీ ఫోటోల్లో గోపికను చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. గుర్తుపట్టలేనంతగా మారిపోయారేంటని అనుకున్నారు. ‘గుర్తుకొస్తున్నాయి’ అంటూ ఆటోగ్రాఫ్ సినిమాలోని పాటను గుర్తు చేసుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది స్టార్స్ అంతే.. చేసింది కొన్ని సినిమాలైనా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంటారు. వారిని చూడగానే అభిమానులకు ఎక్కడ లేని ఆనందం కలుగుతుంది. గోపికను చూసి ఫ్యాన్స్ అదే ఫీలవుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by LOVECO (@lo.ve.co)