charmmekaur : ఆమె మరణాన్ని తట్టుకోలేకపోతున్నా.. ఛార్మీ ఎమోషనల్ పోస్టు

ప్రముఖ కెమెరామెన్ కేకే సెంథిల్ భార్య రూహి మరణం సినీ సెలబ్రిటీలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమెతో ఎంతో అనుబంధం ఉన్న ఛార్మీ ఎమోషనల్ అవుతూ పోస్టు పెట్టారు.

charmmekaur :  ఆమె మరణాన్ని తట్టుకోలేకపోతున్నా.. ఛార్మీ ఎమోషనల్ పోస్టు

charmmekaur

Updated On : February 16, 2024 / 1:44 PM IST

charmmekaur : ప్రముఖ కెమెరామెన్ కేకే సెంథిల్ భార్య రూహి అనారోగ్య కారణాలతో మరణించిన సంగతి తెలిసిందే. సెంథిల్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్న సినీ ప్రముఖులు ఆమె మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. నటి ఛార్మీ తానింకా షాక్‌లో ఉన్నానంటూ ఎమోషనల్ పోస్టు పెట్టారు.

Anushka : క్రిష్ దర్శకత్వంలో మళ్ళీ అదే పాత్ర చేస్తున్న అనుష్క.. ‘వేదం’ సీక్వెల్..!

రాజమౌళి ఆస్థాన కెమెరామెన్‌గా పేరున్న కేకే సెంథిల్ భార్య రూహి అనారోగ్య కారణాలతో గురువారం కన్నుమూశారు. అయితే ఆమె అనేకమంది సినీ ప్రముఖులకు యోగా ట్రైనర్‌గా ఉన్నారు. ఛార్మీ, మంచు లక్ష్మీలకు ఆమెతో మంచి అనుబంధం ఉంది. అనూహ్యంగా ఆమె మరణ వార్త విన్న వీరంతా జీర్ణించుకోలేకపోతున్నారు. ఛార్మీ తన సోషల్ మీడియా ఖాతాలో రూహితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పోస్టు పెట్టారు. ఇలాంటి వార్త వింటానని అనుకోలేదని.. ఇంకా షాక్‌లో ఉన్నానని.. మాటలు కూడా రావడం లేదని .. ఇదంతా అబద్ధం అయితే బాగుండునని కోరుకుంటున్నానని ఛార్మీ పోస్టులో రాశారు. తాము చివరి సారి మాట్లాడుకున్నప్పుడు ఎంతో నవ్వుకున్నామని.. 18 సంవత్సరాల అందమైన స్నేహాన్ని కోల్పోయానని.. నీ ఆత్మకు శాంతి కలగాలి.. అంటూ ఛార్మీ ఎమోషనల్ పోస్టు పెట్టారు.

Ooru Peru Bhairavakona : ‘ఊరుపేరు భైరవకోన’ రివ్యూ.. భయపెట్టి.. నవ్వించి.. మెప్పించారా?

రూహి 2003 నుండి యోగా ట్రైనర్‌గా ఉన్నారు. ప్రభాస్, తమన్నా, ఇలియానాలకు కూడా ఆమె యోగా శిక్షణ ఇచ్చారు. కాగా కొంతకాలంగా ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా సికింద్రాబాద్‌లోని కిమ్స్‌లో ఆమె తుది శ్వాస విడిచారు. సెంధిల్-రూహిలకు 2009 లో వివాహమైంది. రూహి మరణంతో పలువురు సినీ సెలబ్రిటీలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. సెంథిల్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

 

 

View this post on Instagram

 

A post shared by Charmmekaur (@charmmekaur)